పాఠశాల;-సాహితీసింధు సరళగున్నాల-సంగారెడ్డి
తే.గీ*చదువ జ్ఞానమ్మువడసియు సదయులగుచు
బాలబాలికలిచ్చోట ప్రగతిగొనుచు
ముందుకేగిననొజ్జలే మురిసిపోవు
తల్లిదండ్రులకైనను దన్నునగును

ఆ.వె*పాఠశాలయనిన బ్రతుకునేర్పెడిబండి
దారిదప్పకున్న దరికిజేర్చు
అడ్డదారిగనిన నడ్డంకులెదురౌను
బ్రతుకు కృంగిపోవు బాధలెగియు

కం*గురువులు జెప్పినవిద్యయు
గురుతరముగ నేర్చుకొనిన కోరిన కోర్కెల్
దరిజేరియు మురిపించును
తరగక పెంపొందు ధనము ధన్యతదక్కున్

కామెంట్‌లు