మైలబడిపోతున్నది;- సత్యవాణి

 మైలబడిపోతున్నాయి
మహనీయులు నడచినతావులు
కులరాజీకీయరొచ్చు వచ్చిపడ్డాకా
మైలబడిపోతున్నాయి పదవులు
కులాలా కుంపట్లలో నిప్పురాజుకున్నాకా అది
నాదేశాన్ని బుగ్గి చేసేస్తోంది
మైలబడిపోతున్నవి
మనభాషలు
అయోగ్యులు అందలాలెక్కి
ఆర్భాటంగా ఉపన్యసిస్తుంటే
మైలబడిపోతున్నది మా భారతజాతి
మానసిక వికాసం ఏమాత్రంంలేని
అధమాధములు 
చట్టమంటే తెలియకనే సభలలో కాలూనుతున్నప్పుడు
మైలబడిపోతున్నాయి
ఒకనాటి మేటి విజ్ఞానధనులలకంరించిన పీఠాలను
నేడు అజ్ఞానధనులు 
కులమత మౌఢ్య అహంకారాలతో
ఆ పవిత్ర పీఠాలు అధిరోహిస్తున్నప్పుడు
మైలపడిపోతోంది
నా భారతదేశం
విలువలింతలేని
సిగ్గూ శరం మానం మర్యాదా 
సంస్కతీ సాంప్రదాయాలెరుగని
కులమత అధికారోన్మత్తులు
జన్మిస్తున్నందుకు
మైలబడిపోతున్నది
నాదేశం
నా భారతజాతి మైలపడిపోతున్నది
నా భారతమాత 
శోకిస్తున్నది అలోమని
 విలువలుగల తన వలువలు తొలగిస్తున్న తన తనయులనుచూసి
కంటికి కడివేడుగా 
దుఃఖ్ఖిస్తున్నది
       
కామెంట్‌లు