సమయపాలన!అచ్యుతుని రాజ్యశ్రీ

 పగటి మాటలు పనికిచేటు రాత్రి మాటలు నిద్రకు చేటు అని సామెత. బడికి ఆఫీసు కి టైంప్రకారం వెళ్లి తీరాలి. పెళ్లి పేరంటాలకు కాస్త అటుఇటు ఐనా ఫర్వాలేదు. చేతిలో ఫోన్ వల్ల కొందరు గంటలు గంటలు సుత్తికొడుతూ మన బుర్ర తింటారు.మన టైం వేస్ట్ చేస్తారు.అది చాలా తప్పు!
ముర్షిదాబాద్ నవాబు ముర్షిదా ఖాన్ ప్రతిదీ సరియైన టైమ్ లో చేస్తూ ఇతరుల చేత చేయించేవాడు. ఆటైంకి పనిపూర్తి చేయనివాడిని శిక్షించేవాడు.రైతు తన పంటలో1/4వంతు పన్ను కింద కట్టి తీరాల్సిందే అని హుకుం జారీ చేశాడు.ఎక్కువ పండినా తక్కువ పండినా ఇచ్చి తీరాలి. పన్ను కట్టనివారిని దండించేవాడు.రైతులు పన్ను ఠంచన్ గా కట్టేవారు. అఫ్జల్ ఖాన్ షెహనాయి వాయించేవాడు.తెల్లారగానే ఒకే టైంకి షెహనాయి వాయించగానే నవాబు జనానాతో సహా ప్రజలంతా పడకలువీడి పనుల్లో చొరబడేవారు.అది శీతాకాలం!ఖాన్ కి విపరీతమైన జ్వరం!కన్ను చేయికాలు పనిచేయని స్థితిలో పాపం షెహనాయి వాయించలేకపోయాడు.జనం ఆలస్యంగా నిద్రలేచారు.అంతే నవాబు అతన్ని పిల్పించి"నీవు షెహనాయి వాయించకపోటంతో జనం ఇష్టం వచ్చినట్లు నిద్రలేచారు.అస్తవ్యస్తంగా పనులు చేస్తున్నారు. "అని హమీద్ ఖాన్ చేత కొరడాదెబ్బలు కొట్టించాడు."నీకు శిక్ష వేయకపోతే నన్ను ఎవరూ ఖాతరు చేయరు"అన్నాడు.
50కొరడాదెబ్బలతో అతని శరీరం నుజ్జు నుజ్జు ఐంది. ఆరోగ్యం బాగుపడ్డాక ఖాన్ షెహనాయి తో అందరినీ మేలుకొలుపుతూ తన విధి నిర్వహిస్తున్నాడు.ఓరోజు నవాబు నిద్ర లేవలేదు.ఎప్పటికో మెలుకువ వచ్చింది. హమీద్ ఖాన్ ని పిల్చి అందరిముందూ  తన అంగీ విప్పి"నా వీపుపై 50కొరడాదెబ్బలు వేయి"అని  ఆజ్ఞాపించాడు. దర్బార్ జనం మంత్రులు ఎంత మొత్తుకున్నా ససేమిరా అన్నాడు. "నేను పెట్టిన నియమాలు నేను పాటించితీరాలి."హమీద్ కొరడా ఛెళ్ల్ ఛెళ్ల్ అని మోగింది.అంతే ఆరాజ్యంలో ఎవరూ తప్పు చేయాలంటే భయపడేవారు.నవాబు చనిపోయాక గూడా అతని నిబద్ధత ను గూర్చి జనం చెప్పుకునే వారు 🌹
కామెంట్‌లు