పరమార్థం ;-- బాలవర్ధిరాజు మల్లారం

 ఆకలితో అల్లాడే 
అన్నార్థుల పెదవులపై 
చిరునవ్వుల పువ్వులు 
పూచిన నాడు ....
అన్నదాతల ,నేతన్నల,
శ్రమజీవుల చెమటకు 
సరియైన ప్రతిఫలం
లభించిననాడు ...
మేధావుల ,నిరుద్యోగుల,
అంబేద్కర్ ఆశ(యా)లు ఫలించిననాడు....
మరీ ముఖ్యంగా..
ఈ సౌభాగ్యం అందరికీ
సమ భాజ్యం  అయిననాడు...
ఈ స్వరాజ్యం అందరికీ 
సమ భోజ్యం అయిననాడు 
అప్పుడే కదా  
"స్వతంత్రం" పదం  సార్థకం!
అదే కావాలి మనకు పరమార్థం !!

కామెంట్‌లు