కృష్ణ కుచేల (వచన గేయం );-ఎం. వి. ఉమాదేవి

 స్వాగతం మిత్రమా మీరెల్ల కుశలమా 
రావోయి ఎన్నినాళ్లకు రాచరిక మేడలకు 
ఇదిగో నిట కూర్చుండుమో సుధామా 
మీ వేదాధ్యయనము సాగుచున్నదా మిత్రమా 
పాదపూజను స్వీకరింపుము పాలుపాయసమారగించుము 
మా ద్వారక  పండ్లవిగో మధురమ్ము గానుండు 
అలనాటి మిత్రులను ఏలాగ కలియుదును 
సాందీప ఆశ్రమము చక్కని ప్రదేశమోయి 
వల్లె వేసినవన్నీ వరుసగా గుర్తుoడే  
యమునా తీరమందు ఎనలేని ఆటలు 
అడవిలో ఫలములు, ఆపైన సమిథలు 
సేకరించి తెచ్చుట స్నేహితుడా మరువను 
గురుపత్ని దీవెనలు గుమ్మయిన వంటలును 
నాటి ఆటలునేడు నాహ్లాద భరి తాలు 
 వీరునా సతీమణులు సరిసేవ జేయుదురు 
ప్రియమైన మిత్రమా నాకేమి తెచ్చితివి 
ఉత్తరీయము నందు ఊరించు మూటేమీ 
ఓహోహో అటుకులివి ఓపలేనిక యిమ్ము 
నీ స్నేహతీయదనం ఈ యటుకులనున్నదోయి 
ఒక్కటీ గుప్పెడు ఓహో రుచికరము 
మారు గుప్పిట్లోవి మధురమ్ముగా ఉండే 
మూడవ హస్తమును ముదిత వారించింది 
పోయిరమ్మిక నేస్తమా పొందితివి శుభములు !!
కామెంట్‌లు