పూర్వం భువనేశుడు అనే ఒక దురహంకారి రాజుగా ఉండేవాడు. తన తలతిక్క అలోచనా విధానంతో చిత్ర విచిత్ర నిబంధలను పెట్టి రాజ్యంలో ప్రజలను రాచి రంపాన పెడుతుండేవాడు. తమకు ఈ రాజు బెడద ఎప్పుడు వదిలిపోతుందా అని ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురు చేస్తుండేవారు.
ఒకసారి తన రాజ్యంలో ఆ రాజు నామ సంకీర్తనలు, భజనలు పాడేవారిని దేశం నుండి బహిష్కరించి, దైవారాధన కేవలం వేద మంత్రాలు, పూజలతో మాత్రమే చేయాలని శాసించాడు. ఈ ప్రక్రియలో భాగంగా హరిమిత్రుడనే భక్తుడు కూడా దేశ బహిష్కరణకు గురయ్యాడు.హరిమిత్రుడికి వంశపారంపర్యంగా వచ్చిన సంగీతంతో దైవం మీద అతి మధురంగా కీర్తనలు పాడేవాడు.
మొదట్లో దేశం విడిచి వెళ్ళడానికి హరిమిత్రుడు అంగీకరించినప్పుడు సైనికులు అతడి నాలుక బలవంతంగా కోసేసారు. ఈ పాపం భువనేశుడికి చుట్టుకొని మరుజన్మలో ఒక గుడ్లగూబ గా జన్మించాడు.హరిమిత్రుడు ఒక సంగీత విద్వాంసుల ఇంట్లో పుట్టి పూర్వజన్మ సుకృతం వలన సంగీత సాధనతో పాటు అమోఘమైన తపస్సు కూడా చెయ్యసాగాడు.
ఆ గుడ్లగూబ రూపం చాలా వికృతంగా ఉండడం వలన చూసినవారందరూ దానిని అసహ్యించు కోసాగారు.
ఒక సందర్భంలో ఆ గుడ్లగూబకు సంగీత విద్వాంసుడు తారసపడ్డాడు.అప్పుడు దానికి పూర్వజన్మ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి సంగీత విద్వాంసుడికి నమస్కరించాడు.తనకీ వికృత పోవడంతో పాటు తనకు సంగీత జ్ఞానం ప్రసాదించమని ప్రార్ధించాడు.
అప్పుడు సంగీత విద్వాంసుడుకి దయ కలిగి సంపూర్ణ సంగీత జ్ఞానం కలిగేలా అనుగ్రహించాడు. బ్రహ్మదేవుడి మానస పుత్రుడైన నారదుడికి ఆ గుడ్లగూబకు సంగీతం నేర్పించింది.
నారదుడు గురుదక్షిణ ఏమివ్వాలని కోరగా, ‘ఈ భూమి ఉన్నంత కాలం సంగీతకళ తో పాటు తన పేరు శాశ్వతంగా నిలిచిపోవాల’ని అడిగింది. అప్పుడు నారదుడు లక్ష్మీదేవికి గుడ్లగూబను వాహనంగా ఉండే వరాన్ని గురుదక్షిణగా సమర్పించాడు. అప్పటినుంచి గాన బంధువైన గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనం గా మారింది.
సిరులనిచ్చే లక్ష్మీదేవికి వాహనం గుడ్లగూబ. రమాదేవి స్వామివారితో కలిసి జంటగా ప్రయాణించేటప్పుడు గరుత్మంతుడినీ, ఒంటరిగా ప్రయాణించేటప్పుడు గుడ్లగూబనూ వాహనంగా ఎంచుకుంటుందని పురాణాల ద్వారా తెలుస్తున్నది
లక్ష్మీ దేవి వాహనం; -- సి.హెచ్.ప్రతాప్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి