నేస్తాలు ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 అబ్బాయి కున్నారు 
నేస్తాలు చూడు
నేస్తాలు వారు
ఎటువంటి వారు? 
ఎలుక పిల్లను చూసి 
ఎగిరే వారు 
పంది పిల్లను చూసి
పరుగెత్తు వారు 
కుక్కపిల్లను ఎక్కి 
కూర్చుండు వారు 
చేప గంపల కాడ 
చెయిజాచు వారు 
కూర గంపల కాడ 
కూర్చుండు వారు 
పల్లేరు గాయల్ల
పరుపేయు వారు 
మామిడీ తోపుల్ల 
మంటపెట్టే వారు
అటువంటి వారితో
స్నేహమూ వద్దురా 
ధీరులూ శూరులూ
ఆలోచనాపరులు
ఆడి తప్పనివారు
పరోపకారులు
మంచి నేస్తాలను
ఎంచి చేసుకోర !!

కామెంట్‌లు