బాల ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 పుట్టింది ఒకబాల 
పెరిగింది ఆబాల 
ఆడింది ఆబాల 
పాడింది ఆబాల
ముద్దుముద్దు మాటలతో 
మాటాడింది ఆబాల
బుడిబుడి నడకలతో 
నడిచింది ఆబాల 
పొడుపు లెన్నోపొడిచింది 
అవి విప్పి చెప్పింది 
వింతలు వినోదాలు 
చాల చాల చెప్పింది 
చదువులన్ని చదివింది 
రాతలన్ని రాసింది 
బాలలతో స్నేహం 
నేస్తాలతో కబుర్లు 
చైతన్యపు సెలయేరు 
ఆనందపు విరిజల్లు 
ఆబాల మాబాల 
అందాల మా బుజ్జిబాల !!

కామెంట్‌లు