అత్యంత దుద్దినం ఈ రోజు హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబు;- డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్

 మానవజాతి చరిత్రలో ఆగస్టు 6 అత్యంత దుర్దినం. మానవ నాగరికత సృష్టించిన అత్యంత భయంకర ఆయుధం ఈ రోజున ప్రయోగించబడి తన విధ్వంసక రూపాన్ని ప్రదర్శించింది. 1945 ఆగస్టు 6న అమెరికా ప్రయోగించిన తొలి అణుబాంబు (లిటిల్‌ బారు) జపాన్‌ లోని హిరోషిమా నగరంలో పాఠశాలలకు వెళుతున్న చిన్నారులతో సహా అప్పటికప్పుడు 90,000 మంది ప్రాణాలు హరించింది. 35,000 మందిని క్షతగాత్రులను చేసింది. మరో మూడు రోజులకు ఆగస్టు 9వ తేదీన జపాన్‌ లోని మరో నగరం నాగసాకి పై అమెరికా వేసిన రెండో బాంబు (ఫ్యాట్‌ మాన్‌) సుమారు 70,000 మంది ప్రాణాలు తీసింది. ప్రపంచంలో ఇప్పటివరకు మానవులపై ప్రత్యక్షంగా ప్రయోగించబడిన అణు బాంబులు ఈ రెండు. ఇవి సృష్టించిన విధ్వంసం బాంబులు ప్రయోగించబడిన క్షణానికే పరిమితం కాలేదు. ఆ తరువాత నెలలు, సంవత్సరాల పాటు ప్రజలు చనిపోతూనే ఉన్నారు. కాలిన గాయాలు, అణు రేడియేషన్‌ ప్రభావంతో క్యాన్సర్‌ వంటి వ్యాధులతో మరో లక్షన్నరమందికి పైగా మరణించారు. కొన్ని లక్షల మంది అంగ వైకల్యాలకు గురైనారు. అణుధార్మికతకు గురైన వారి బిడ్డల్లో, వారి తరువాతి తరాల్లో కూడా దాని ప్రభావం కనిపిస్తూనే ఉంది.
                         
             యుద్ధంలో మరణించిన హిరోషిమా: వేల సంఖ్యలో  సైనికులు మరణించారు 70,000–146,000 పౌరులు మరణించారు నాగసాకి: 39,000–80,000 మంది మరణించారు మొత్తం: 129,000–246,000 మంది మరణించారు
యుద్ధం చివరి ఏడాదిలో మిత్రరాజ్యాలు జపానును ఆక్రమించుకునేందుకు సిద్ధపడ్డాయి. దీనికి ముందు అమెరికా సాంప్రదాయిక బాంబుదాడులు చేసి 67 జపాన్ నగరాలను ధ్వంసం చేసింది. 1945 మే 8 న, హిట్లరు ఆత్మహత్య చేసుకున్న కొద్దిరోజులకు, జర్మనీ లొంగుబాటు ఒప్పందంపై సంతకం చెయ్యడంతో ఐరోపాలో యుద్ధం ముగిసింది. ఓటమి తప్పని స్థితిలో ఉన్న జపాను బేషరతు లొంగుబాటుకు ఒప్పుకోకపోవడంతో పసిఫిక్ యుద్ధం కొనసాగింది. జపాను బేషరతుగా లొంగిపోవాలని 1945 జూలై 26 న మిత్ర రాజ్యాలు తమ పోట్స్‌డామ్ డిక్లరేషనులో ప్రకటించాయి. లేదంటే పెను వినాశనమేనని కూడా డిక్లరేషను హెచ్చరించింది. జపాను దాన్ని పెడచెవిని పెట్టింది.
1945 ఆగస్టు నాటికి మన్‌హట్టన్ ప్రాజెక్టు రెండు రకాల అణుబాంబులు తయారు చేసింది. మారియానా ద్వీపాల్లోని టినియన్ నుండి ఈ బాంబులను మోసుకెళ్ళేందుకు అమెరికా వైమానిక దళం బోయింగ్ B-29 సూపర్‌ఫోర్ట్రెస్‌ను సమకూర్చుకుంది.
నాలుగు జపాను నగరాల మీద అణుబాంబులు వెయ్యాలని జూలై 25 న ఆదేశాలు జారీ అయ్యాయి. ఆగస్టు 6 న అమెరికా హిరోషిమాపై యురేనియం గన్ రకం బాంబును (లిటిల్ బాయ్) వేసింది. లొంగిపోవాలని అమెరికా అధ్యక్షుడు జపానుకు చెప్పాడు. లేదంటే "చరిత్రలో ఎన్నడూ చూడని వినాశనం ఆకాశం నుండి వర్షిస్తుందని" హెచ్చరించాడు. మూడు రోజుల తరువాత, ఆగస్టు 9 న ప్లుటోనియమ్ ఇంప్లోజను రకం బాంబును (ఫ్యాట్ మ్యాన్) నాగసాకిపై వేసింది. రెండు నుండి నాలుగు నెలల్లో హిరోషిమాలో 90,000
దాదాపు సగం మంది మొదటిరోజునే మరణించారు. ఆ తరువాతి నెలల్లో కాలిన గాయాల వలన, రేడియేషన్ సిక్‌నెస్ వలన, ఇతర గాయాల వలన, పౌష్టికాహార లోపంతో కూడి అనేక మంది మరణించారు. మరణించినవారిలో ఎక్కువమంది సాధారణ పౌరులే. హిరోషిమాలో మాత్రం ఒక సైనికస్థావరం ఉంది.
నాగసాకిలో బాంబు వేసిన ఆరు రోజుల తరువాత జపాన్ లొంగిపోతున్నట్లు ప్రకటించింది. సెప్టెంబరు 2 న లొంగుబాటు పత్రంపై జపాను ప్రభుత్వం సంతకం చేసింది. దాంతో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. లక్షకు పైగా ప్రాణాలను బలితీసుకున్న ఈ అణుదాడుల నైతికత నేటికీ చర్చాంశముగా మిగిలింది
       యుద్దాల వలన ప్రధానంగా  అనాథ పిల్లలు ఎదుగుతున్న క్రమంలో వారికి మానసికంగా, సామాజికంగా, శారీరకంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటిని  రూపుమాపి, వారి సంక్షేమానికి బాటలు వేసే ప్రపంచ శాంతికై పోరాడాల్సిన బాధ్యత  సమాజంపై ఎంతైనా ఉన్నది.
==================
 డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్
విశ్లేషకులు,
 సభ్యులు, ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసర్చ్ ఫౌండేషన్.
Cell.. 9490841284
రాజన్న సిరిసిల్ల.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం