అబ్దుల్ కలాంకు అత్యున్నత సలాం; -కందేపి రాణీ ప్రసాద్
రామేశ్వరం నుండి
రోదసి కుహరం దాకా 
కష్టాలతో పయనించి

పంచ భూతాల సాక్షిగా
అగ్ని పృథ్వి ఆకాశ్
క్షిపణుల్ని ప్రయోగించి

అగ్రరాజ్యాలకు
పొరుగు దేశానికీ
వణుకులు పుట్టించి

రక్షణ రంగంలోనూ
మెదవుల్ని ఆశ్యర్యపరిచి,

భారతీయ సైన్స్ కాంగ్రెస్
సమావేశంలో
శాస్త్రవేత్తల్ని ఆకర్షించి
భారతరత్న ను స్వీకరించిన

క్షిపణి శాస్త్రవేత్త అబ్దుల్ కాలమ్ నకు
విశ్వాంతరాళం అంతా గులమ్ అయినా
వేళ భారతీయులందరి సలాం ఇది 

కామెంట్‌లు