సుప్రభాత కవిత ; -బృంద
ఎక్కడున్నాం అన్నది కాదు
ఎంత సంతోషంగా  ఉన్నాం
అన్నది  ముఖ్యం.

ఎక్కడున్నా అనుకూలంగా
మలచుకోవాలి..

గతం గాయమైనా...
నవ్వుతో మంత్రం వేసుకోవాలి.

జ్ఞాపకాలు  మరచిపోకుండా
ఉత్తేజితం కావాలి..

గుండె నిండిన చక్కని
స్మృతులు విరబూస్తూ ఉండాలి.

మళ్లీ  మళ్లీ  సంతోషం
అనుభవించాలి...

కలతలు  కష్టాలూ కన్నీళ్ళూ
సంతోషాలూ సుఖాలూ నవ్వులూ

ఏవీ  మనతో ఉండవు
నిరంతరం....

 మనసు చేసే మాయనే
అంతా.....
మనదనుకుంటే బాధ
కాదనుకుంటే సుఖం...

గుండెలోని గురుతులన్నీ
అంతరంగాన  గుదిగుచ్చి పేర్చి...
కన్నీరు చిందేలా గుర్తుచేసుకోవాలి.

మౌనమైన తలపులు
ఆపలేము.....పంచలేము


రేపు తెచ్చే కలల మోపు
జీవితాన్ని ముందుకు నడుపు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు