భాష !ఓయబ్బో!ఏమి సొగసు!...అచ్యుతుని రాజ్యశ్రీ 

 జయభర్తకి బెంగళూరు తబాదలా అయింది. మహాఎగిరి గంతేసింది. గార్డెన్ సిటీ లో కాపురం!ఏంమజాలే హలా!?మైసూరు బృందావనగార్డెన్స్ మైసూరు వేడివేడి బోండాలు ..కలల అలల్లో తేలిపోతోంది.కన్నడ కస్తూరి  అని ఆభాషకు పేరు. లిపి కూడా  దాదాపు తెలుగు లిపి! చదవటం తేలిక. కాకపోతే పదాల అర్థం తెలియాలి.     బెంగళూరు లో జయ వాళ్ళ అపార్ట్మెంట్ లో అంతా కొంకణీవాళ్లే!అస్సలు అర్ధం కాదు. ఇంగ్లీష్  హిందీ కలగాపులగం చేసి మాట్లాడుతోంది.ఆరోజు  టి.వి.దీక్షగా చూడసాగింది. కన్నడ సినిమా మూగసినిమా లా అనిపిస్తున్నా కథ అర్థం అవుతోంది. "ఈగ నమ్మ కేంద్ర " అక్షరాలు చూసి  ఉలిక్కిపడి మధ్య లో  ఈగ ఎలా దూరిందాఅని  తన తలతిక్క ఆలోచన లను బరికింది. కుప్పలుతెప్పల వాన మబ్బుల్లా  కపిత్వం ఆమెలోంచి  తన్నుకుని పొడుచుకుని బైటికి వస్తుంటే  ఆమె భర్త "ఆపు నీ శివాలు!వాయి ముడు.బాయ్ ముచ్ కై కట్ "అని గర్జించాడు."అంటే ఏంటి సారూ!పప్పుచారూ?"నోరుముయ్యి. చేతులు కట్టు నోరుకుట్టు"ఒకేసారి  తమిళ  కన్నడతో  తెరుచుకున్న ఆమె నోటి కి తాళం వేశాడు.  ఇంతకీ జయకి ఈగ అన్న పదంకి అర్ధం తెలీలేదు.ఎలాగైతేనేమి కొండను త్రవ్వి ఎలుక ను పట్టింది. ఈగ అంటే ‘ఇప్పుడు ‘ అని తెలుసుకున్నాక ఆమె కడుపు ఉబ్బరం తీరింది. ముప్పై రోజులలో కన్నడభాష పుస్తకం పుణ్యమా అని కొన్ని  పదాల అర్థాలు తెలుసుకుంది. వాకిలి ముందు నించున్న అవ్వ గొంతు చించుకుని "అమ్మా!తరకారీ. ..సొప్పు. బేకా?" ఈ బేకు సాకు చాకు ఏంటీ?సొప్పు ఏంటీ పప్పు లాగా? పక్కింటి ఆమె ఎష్టు అని  తొగో హత్తు రూపయా అని పదిరూపాయల నోటు చేతిలో పెట్టింది. "బాళేహన్ను తొగో"అని పండబారిన నాల్గు అరటిపళ్ళు చేతిలో పెట్టింది.
నాల్గు అరటిపండ్లు చేతిలో పెట్టింది.ఆపై తట్టి నెత్తిన పెట్టుకొని"సొప్పో సొప్పు"అని వెళ్లి పోయింది.సొప్పు అంటే ఆకుకూరలు అని అర్థం అయింది.బేడ అంటే వద్దు అని సాకు అంటే చాలు అని  బా అంటే ‌రమ్మనమని‌ హోగు అంటే వెళ్లు అని వాటి అర్ధాలు తెలుసు కుంది.అవసరం ఉన్న లేకున్నా ‌ఆపదాలు వాడుతూ  రోజూ భర్త జుట్టు పీక్కునేలా చేస్తోంది.పాపం! మానవుడు నోరెత్తడు.ఏమన్నా అంటే వంటి మానేస్తే తన గతి ఏమిటి ?అసలే కరోనా రోజులు! బైట తినాలంటే హడల్! తిరుపతి వెళ్లకుండానే  తన తలని నున్న గా చలిమిడి ముద్ద చేస్తోంది అని నెత్తి కొట్టుకోవడం మొదలు పెట్టాడు.కానీ ఒకరోజు "ఏంటోయ్! ఇంట్లో అప్పడాలకర్ర ప్రయోగం జరిగిందా?బొప్పికట్టింది తల దగ్గర"అని ఫ్రెండ్ అడిగితే"కిటికీ తలుపు కొట్టుకుంది.అక్కడ కూచుని పేపర్ చదివి హఠాత్తుగా లేచాను"అని చెప్పాడు.హు..ఇక లాభంలేదు.తెలుగు రాష్ట్రంకి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి అని దృఢనిశ్చయానికి వచ్చాడు.(ఇది సరదాగా రాసిన కథ.ఎవరినీ కించపరిచే ఉద్దేశం కాదు.) అచ్యుతుని రాజ్యశ్రీ
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం