వ్రతము;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 టీవీ వచ్చిందీ టీవీ వచ్చిందీ
మా ఇంటికి టీవీ వచ్చిందీ
మా ఇంటికి ఠీవీ వచ్చిందీ
అప్పటినుండీ ఇప్పటిదాకా
అమ్మానాన్నల మాటలు బందూ
పిల్లల ఆటలు అన్నీ బందూ
వచ్చిన చుట్టాల నోరులు బందూ
నేస్తాలందరి మూతులు బందూ
తాతామామ్మల మౌనవ్రతమూ
అమ్మాఅక్కల మౌనవ్రతమూ
వంటగదికీ మౌనవ్రతమూ
అన్నిటి మూలము టీవీ వ్రతమూ !!

కామెంట్‌లు