ఉద్యమ వీరుడు;- dr కందేపి రాణీ ప్రసాద్
""మాకొద్దీ తెల్లదొరతనం వద్దు''
ఎలుగెత్తి చాటిన దేశభక్తుడు
మాకీ బానిసత్వం వద్దని
ఎంతో ఘాటుగా చెప్పిన వీరుడు

ఆకాశం దద్దరిల్లేలా
భూగోళం బద్దలయ్యేలా
దిక్కులన్నీ పిక్కటిల్లేలా
''స్వరాజ్య గీతాలు ''పాడాడు

వీరావేశంతో కదం తొక్కుతూ
వీధుల్లో పాడి కవాతు చేస్తూ
స్వాతంత్ర్య సిద్ధి కాంక్షులై
స్వాభిమాన పోరాటం చేసాడు

మాయ మాటలతో నమ్మబలికి
వ్యాపారం పేరుతో అడుగుపెట్టి
దేశాన్ని దోచిన బ్రిటీషోడిని
వణికించిన ఉద్యమ వీరుడు.


కామెంట్‌లు