జై కొట్టాల్సిందే!!;-సి. శేఖర్(సియస్సార్),పాలమూరు,9010480557.
హలాన్ని పట్టిన
కలాన్ని పట్టిన

మోగే తప్పెటైనా
నేసే బట్టలైనా
అల్లె బుట్టలైనా
తార్చే కుండలైనా

కట్టే ఇటుకలైనా
చేసే తలుపులైనా
కారం మెతుకులైనా
కొరమీను చేపలైనా

పట్టె ఆయుధమైన
పాడే గీతమైనా
గంతేసే గజ్జెలైనా
రాసే రాతలైనా

ఎండకెంతెండినా
వానల తడిసిన
చలిలో వణికిన

కష్టానికి
చిందే స్వేదానికే
జై కోట్టాల్సిందే
జయం సాధించాల్సిందే


కామెంట్‌లు