ఆనందం మణుగుడు;- డా.పి.వి.ఎల్.సుబ్బారావు. 9441058797.
 బాల పంచపదులు
===============
1. గ్రామీణ ఆట చెడుగుడు!
   ఆ ఆనందం  మణుగుడు!
   కూత వేస్తూ  పరుగిడు!
   నేర్పు చూపి కలబడు!
   కబడ్డీ ఆడాలి,
           ఆడి గెలవాలి, రామా!
2.అవసరం లేదు ఏ హంగులు!
   కొనక్కరలేదు ఏ వస్తువులు!
   కోర్టు జాగా ఉంటే చాలు!
  పిల్లలకు అదే ఎంతో మేలు!
  కబడ్డీ ఆడాలి ,
      ఆడి గెలవాలి, రామా !
3. రెండు టీములు ఆడాలి!
   టీముకు ఏడుగురు ఉండాలి!
  కూత పెట్టాలి పట్టు పట్టాలి!
   జట్టు కట్టాలి జయించాలి!
   కబడ్డీ ఆడాలి ,
        ఆడి గెలవాలి ,రామా!
4. చూసేవారిచ్చే ప్రోత్సాహం!
  ఆడేవారికి ఎంతో ఉత్సాహం !
  ఉభయులకు సువర్ణావకాశం!
  ఆ సమయం సద్వినియోగం!
 కబడ్డీ ఆడాలి ,
          ఆడి గెలవాలి రామా!
 
5.  కబడ్డీ ఆట విజేతలు!
     ఉద్యోగాల్లో ప్రాముఖ్యతలు!
     ఆటగాడిగా అభినందనలు!
     ఉద్యోగస్తుడిగా  మన్ననలు!
    కబడ్డీ ఆడాలి ,
          ఆడి గెలవాలి, రామా!
6. కబడ్డీ,కోకో పిల్లలు ఆడాలి!
    వాటిలో పిల్లలు ఆరితేరాలి!
    ఆటల్లో గెలుస్తూ ఉండాలి!
   జీవితాన ముందుకు పోవాలి!
   కబడ్డీ ఆడాలి ,
          ఆడి గెలవాలి, రామా!
7. కబడ్డీలో,
     "ద్రోణాచార్యులు" ఉన్నారు!
   "అర్జునులు",
            తయారవుతున్నారు!
    పోటీల్లో గెలుస్తున్నారు!
    గుర్తింపు సాధిస్తున్నారు!
    కబడ్డీ ఆడాలి ,
         ఆడి గెలవాలి, రామా!
________


కామెంట్‌లు