ఒక వ్యక్తి బాధల్లో ఉండి మరొక వ్యక్తి దగ్గరికి వెళ్లి సలహాలు అలా చేయాలి ఇ లా చేయాలి అని చెపుతూ వుంటాడు కానీ ఆ సమస్య తనకే వస్తే దానిని ఎలా పరిష్కరిస్తాడు దానిని గురించి మాత్రం చెప్పడు, చెప్పలేడు దానికి కారణం ఆ స్థితి తనకు రాలేదు కనుక నీతులు ఎందుకు చెబుతారు ఎవరికి చెప్పారు నిజంగా అతను ఆచరించి చెప్తున్నాడా? నేను ఇలా చేశాను దాని ఫలితం ఇలా ఉంది అని ఎవరైనా ఆత్మ శుద్ధితో మాట్లాడే వాళ్ళు ఉంటే తప్పకుండా ఆచరించి నమస్కారం చేయవలసినదే కానీ అలా జరగడం లేదు కదా లోకం తీరు వేరుగా ఉంటుంది. వేరే మాటలు చెప్పేవాడు ఎన్నైనా చెప్తాడు. అందుకే మన పెద్దలు అంటారు చెప్పేవాడికి వినేవాడు లోకువ అని. కాలక్షేపాన్ని ప్రదర్శించడానికి మాట్లాడే మాటలు తప్ప ఆ సమస్యను పరిష్కరించే మాటలు మాత్రం కావు. అలా కావాలి అంటే ఎంతో చిత్తశుద్ధి ఉండాలి, నిజాయితీ ఉండాలి. మనిషిగా మనిషిని గురించి ఆలోచించే మనస్తత్వం ఉండాలి అప్పుడు అతని మాటలు మనం వింటాం. అందుకే వేమన మహా యోగి ఇలాంటి వారిని అనేక మందిని గమనించిన తరువాత నేఈ పద్యం చెప్పి ఉంటాడు. ఈ జన్మ సఫలం కావాలంటే మాట్లాడే పెదవులు కాదు చేసే చేతులకు పని చెప్పు అని మన పెద్దల మాట. తనకు గానీ, తన కుటుంబానికి గానీ, తన గ్రామానికి కానీ ప్రజలలో ఎవరికైనా కానీ ఏ కొంచెం పేరు తెచ్చే పనిచేసినా ఇతని పేరు శాశ్వతంగా ఉంటుంది లేదా ఎవరూ పట్టించుకోరు. అతని శరీరం మట్టిలో కలిసి పోయినట్లే అన్ని పనులు కూడా గాలిలో కలిసిపోతాయి. అలాంటి చెడ్డ పేరు తెచ్చుకునే స్థితిలో ఎవరూ ఉండకూడదు మంచి పేరు తెచ్చుకొండి అని సలహా ఇవ్వడం కోసమే ఈ పద్యాన్ని మనకందించాడు వేమన. మన పెద్దలు ఒక చిన్న కథ చెబుతారు ఒక పౌరాణికుడు ఆహారపుటలవాట్ల గురించి కథ చెబుతూ పచ్చి ఉల్లిపాయ తామస గుణాన్ని ప్రేరేపిస్తుంది, దానివల్ల చెడు జరుగుతుంది తప్ప మంచి జరగదు కనుక దానిని విసర్జించండి అని చెబితే అందరూ కరతాళధ్వనులతో అభినందించారు. కథ పూర్తయిన తరువాత ఇంటికి వెళితే పౌరాణికుని భార్య కూడా ఆ కథ విన్నది అందువలన ఎక్కడా ఉల్లిపాయ వాడలేదు అదేమి టే ఉల్లిపాయ లేకుండా చేసావ్ అది లేకపోతే కూరకు రుచి ఎక్కడి నుంచి వస్తుంది అని గద్దించే సరికి మీరు చెప్పిన విషయమే కదండి నేను విన్నది అందుకే అలా చేశాను అనే సరికి ఆయన పకపకా నవ్వి నేను చెప్పింది నిజమే అది చెప్పింది నీకు కాదు వినే వాళ్లకు అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. దానిని మన వేమన ఎంత అందంగా చెప్పాడో చూడండి.
ఆ పద్యాన్ని మీరు కూడా ఒకసారి చదవండి
"తనువులస్థిరమని ధనములస్థిరమని తెలుపగలడు తాను తెలియలేడు
చెప్పవచ్చు బనులు చేయుట కష్టమౌ..."
ఆ పద్యాన్ని మీరు కూడా ఒకసారి చదవండి
"తనువులస్థిరమని ధనములస్థిరమని తెలుపగలడు తాను తెలియలేడు
చెప్పవచ్చు బనులు చేయుట కష్టమౌ..."
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి