గురు సేవ ;-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 మానవ శరీరం శమ దమాదులతో  పుట్టినది.  శరీరం పంచభూతములలో ఏర్పడినది. శరీర లక్షణాలు వేరు అది చేసే పనులు వేరు  శరీరం లోపల ఉన్న అవయవాలు వాటి పని వేరు  ఒకటి కనిపించేది మరొకటి కనిపించనిది భారత దేశాన్ని పరిపాలించిన  పరాయి పాలకుల కష్టాలనుంచి స్వాతంత్ర్యాన్ని సంపాదించడం కోసం బాలగంగాధర్ తిలక్, మహాత్మాగాంధీ, వినోబా లాంటి వారు అనేక మంది స్వాతంత్ర్య సమరయోధుల  కృషి ఫలితంగా  మనం ఈనాడు హాయిగా ఆనందంగా ప్రశాంతంగా జీవితాన్ని గడపుతున్నాం. ఇంత ప్రశాంతతకు మూలకారణాన్ని ఒక్కసారి ఆలోచించండి  శాంతము లేకపోతే వాడు మృగంతో సమానం మృగాల్లా గా ప్రవర్తించిన ఇతర దేశస్థుల మనస్తత్వాలను దహించి వేయడానికి ఈ మహాత్ములు శాంత స్వభావంతో వ్యవహరించారు లాఠీలతో కొట్టినా, తుపాకీని చూయించిన, అదరక, బెదరక ప్రకాశం పంతులు లాంటి మహానుభావులు చొక్కా చించి వారికి ఎదురుగా నిలబడి కాల్చండి రా నా దేశం కోసం నా ప్రాణాలను ఇవ్వడానికి కూడా సిద్ధం అన్న నినాదాలతో  సంపాదించిన స్వాతంత్ర్యం మన అందరి చేతులకు ఫలాన్ని  అందించింది. శాంతము లేక సౌఖ్యము లేదు  అన్న త్యాగరాజ స్వామి కీర్తనను మనం జ్ఞాపకం పెట్టుకుంటే  సమాజములో ఏ ఇద్దరికి తగాదాలు, పొరపొచ్చాలు ఉండవు. విద్యార్థులంతా ఒక రకంగా ఉండరు వీరిలో ఏకసంధాగ్రాహులు ఉంటారు అతనికి ఒకసారి చెప్పగానే అర్థమవుతుంది. మరో రకం కుర్రవాళ్ళకు రెండు సార్లు చెప్పాలి చివరివాడు మరొక సారి, ఇంకొక రకం వాడికి ఎన్నిసార్లు చెప్పినా గాని ఫలితం ఉండదు వాడినే మందమతి అంటాము. ఆ మందమతులకు కూడా చక్కటి విద్యను నేర్పిన గురువులు ఎంత సహనంతో ఉండాలి  ఎన్నిసార్లు చెప్పినా రాదు బుద్ధి లేదేరా అని తిట్టడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఆ కాస్త ఆలోచన కూడా లేకుండా పోతుంది  కనుకనే అధ్యాపకుడు తన తొడలకు దగ్గరగా లేదా తన తొడ పైన కూర్చోబెట్టుకొని లాలించి బుజ్జగించి ప్రతి అక్షరాన్ని ఏ కోపతాపాలకు లోనుకాకుండా చెప్పడం వల్ల మాత్రమే అలాంటి మందమతులు కూడా బుద్ధిమంతులు అవుతున్నారు దానినే గురూపదేశం అంటారు.
తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు బాగు చేయడానికి ఉత్తమ ఉపాధ్యాయుణ్ణి ఎన్నిక చేస్తారు. ఎలాంటి ఆలోచనలు లేకుండా ఎవరు కనిపిస్తే వాడి దగ్గరికి పంపినట్లయితే ఆ గురువు పద్ధతి ఎలా ఉంటుందో శాంతమూర్తిగా నేర్పగలడా అన్నది తెలీకుండా  చేర్చినట్లయితే  మంచి ఫలితం రాదు కదా అనేక చెడ్డ అలవాట్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందువలన పెద్దలు  తొందర పడకుండా  ప్రశాంతంగా ఆలోచించి నలుగురిని సంప్రదించి అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఈ శాంతాన్ని గురించిన గొప్పతనాన్ని చెప్పాలంటే  అంత తేలికైన విషయం కాదు అని వేమన వారు చెప్పిన పద్యం. ఆ పద్యం వ్రాస్తాను చదవండి.
"శాంతమె జనులను జయమునొందించును  శాంతముననె గురుని జాడ దెలియు  
శాంత భావ మహిమ    చర్చించలేమయా..."


కామెంట్‌లు