:స్వతంత్ర భారతం:ఎస్ ముంతాజ్ బేగం-చరవాణి :9700378927
ప్రక్రియ :సున్నితం
------------------------
సుందర నందన భారతదేశం
త్యాగాలతో పండిన స్వతంత్రదేశం
మువ్వన్నెలజెండా రెపరెపలతో మురిసేదేశం
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

గలగల పరుగుల నదులున్నదేశం 
చుట్టూఎత్తయిన హిమగిరులున్న నాదేశం 
భిన్నత్వంలో ఏకత్వమే నాదేశం
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

వజ్రోత్సవ వేడుకలతో వన్నెలీనుచున్న 
సర్వసత్తాక  సామ్యవాద లౌకిక 
ప్రజాస్వామ్య  గణతంత్రదేశం నాదేశం
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

పంచశీలను బోధించిన దేశం
త్యాగం శాంతిసాఫల్యతలకు ప్రతిరూపం
అహింసావిధానమే ప్రధానమైన దేశం 
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

సహజ సంపదల భూతలస్వర్గం 
వేదాలు పుట్టిన దేశం 
వీరపుత్రులను గన్నదేశం నాభారతదేశం
చూడచక్కని తెలుగు సున్నితంబు!!

కామెంట్‌లు