గురజాడ అప్పారావు (బాలగేయం);--గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు,గణితోపాధ్యాయుడు,సెల్:9966414580.
అక్షరాల కోటలో
గురజాడ కవిరాజు
సాహిత్య గగనంలో
సాటిలేని నెలరాజు

అభిమానుల హృదయాల్లో
ఉదయించిన భాస్కరుడు
ముత్యాల సరాలతో
మురిపించిన  మొనగాడు

దురాచారాలపై పోరు
సల్పిన అక్షరయోధుడు
బాల్యవివాహాలను ఇల
ఎదురించిన మగధీరుడు

రాయవరంలో పుట్టెను
సాహిత్యంలో మెరిసెను
గురజాడ అప్పారావు
వాడుక భాషలో వ్రాసెనుకామెంట్‌లు