అమాయకత్వం అందం; డాక్టర్ . కందేపి రాణిప్రసాద్
పసితనానికి అమాయకత్వం మాయమైంది
బాల్యానికి సహాయ తత్వం చచ్చి పోయింది
పిల్లలకు మంచి తనానికి అర్థం తెలియదు
బాలలకు మానవత్వపు విలువలు తెలియదు

వయసుకు మించి మాట్లాడితే ఆనందం
బుద్ధి కి మించి పనులు చేస్తే గొప్పదనం
ఏదైనా సహాయం కోరితే తప్పించుకోవాలి
ఎవరైనా అవసరం ఉంటేనే మాట్లాడాలి

సహాయం తీసుకోవాలి కానీ చెయ్యకూడదు
ఎదురింట్లో తినాలి కానీ మనం పెట్టకూడదు
పక్కింట్లో తెచ్చుకోవాలి కానీ తిరిగివ్వకుడదు
నా నోట్లో వేలు పెట్టు, నీ కంటిలో వేలు పెడతా.

ఇలా నేర్పిస్తే పిల్లలు ఎలా తయారు అవుతాయి
తల్లిదండ్రుల్ని కూడా అలాగే బోల్తా కొట్టిస్తారు
ఉన్న దాంట్లో సర్దుకోవడం నేర్పించక పోతే
అమ్మా నాన్నలకు సైతం అన్నం పెట్టలేరు

మంచితనం చూపించండి,మంచి నేర్పండి
మానవత్వం చూపండి మనిషి నీ ప్రేమించండి
బాల్యానికి ,పిల్లలకు అమాయకత్వం అందం
ఆరిందా తనం అతి తెలివి  వినాశ కరం

కామెంట్‌లు