సుప్రభాత కవిత ; -బృంద
రంగులీను ఈ జగమే
సుందర నందనవనము

ప్రతి ఉదయం 
ఒక అద్భుతం

మనచుట్టూ ఉన్నరంగులే
మన జీవితంలోనూ....

ఆశకు వెలుగు
నిరాశకు చీకటి

కోరిక కు ఎరుపు
తృప్తికి తెలుపు

ప్రతిభావానికీ
ఒకరంగు ప్రతీక

చెలిమిదో రంగు
ప్రేమదో రంగు

లోపల ఓ రంగు
బయటికో రంగు

వేకువలో రంగుల
రంగవల్లులేసే గగనం

రంగురంగుల పువ్వులతో 
ఆకులతో
నవ్వే భువనం

ప్రకృతిని చూస్తూపరవశించే  అంతరంగముంటే

రకరకాల రంగుల పువ్వులు
విరబూసిన అనుభూతుల
ఉద్యానవనం మన జీవితం.

హృదయంతో 
ఉదయరాగమాలపించి
స్వాగతిద్దాం మరో రోజును

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు