ఉపాధ్యాయ సంక్షేమమే ఎ.పి.టి.ఎఫ్ ధ్యేయం

 తొట్టంబేడు :ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి,సంక్షేమానికి అహర్నిశలు
ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పోరాడు
తుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.భానుమూర్తి అన్నారు.తిరుపతి జిల్లా
ఏ.పి.టి.ఎఫ్ కార్యవర్గ సమావేశంలో
ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలం ఎ.పి‌.టి.ఎఫ్ శాఖ ఆయనను
సత్కరించింది.మండల అధ్యక్షుడు
కయ్యూరు బాలసుబ్రమణ్యం తాను
రాసిన మూడు కవితా సంపుటీలను అందజేసారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్రమణ్యం, మండల
ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్,గౌరవ 
అధ్యక్షుడు శ్రీనివాసులు, జిల్లా కౌన్సిలర్స్ పెరుమాళ్,లక్షీప్రసాద్,ఈశ్వరయ్య,ఎం.బి.ప్రసాద్ పాల్గొన్నారు.
కామెంట్‌లు