తెలుగు ఒడిలో...21
చెరుకు
పిల్లల మొదలు పెద్దలు వరకు అందరు
ఇష్టపడే వాటిలో చెరకు
ఒకటి. దీనిని తియ్య మ్రాను అంటారు
మరి చెరుకు తీయగా ఉంటుందికదా .అందుకే ఆ పేరు.
ప్రాణులన్నిటికి కన్నులుంటాయి కదా.
అలాగే ఈ చెరకుకు కూడా కన్నులు ఉంటాయని దీనిని కన్నుల మ్రాను అంటారు.చెరకుకు కణుపులుంటాయి కదా ఆ కణుపులనే కన్నులంటారు. చెరుకు ఆకులు చాల అందంగా ఉండటమే గాక కత్తుల్లా పదునుగా ఉంటాయి
అందుకే చెరకును "అసిపత్రము "అని అంటారు.అంతే కాదు ఇంచు, ఇంచుమించు, ఇక్షువు,తుంట, మృత్యుపుష్పము, రసదారి, రసాలం వంటి పేర్లతో పిలుస్తారు.
వరి, చెరుకు, దర్భ, కామంచిగడ్డి, మొఛలైన వాటిని తృణ పంచకం అని అంటారు.అలా గడ్డి జాతికి చెందిన ఈ చెరకును చెరుకు చెట్టు అనికాక "చెరకుగడ" అని అంటారు.దీనిని ఇంకా అంగారిక, ఇక్షుదండము,చెరుకు దీగె, చెరకుగోల అని అంటారు.చెరకు గడకుండే కణుపులను కన్నులు,కనుపులు, గుంటులు, పర్వరీణములు, పర్వములు
అనే పేర్లతో పిలుస్తారు
మనుషుల్లో ఉన్నట్టే ఈ చెరకు కాంతారము, పుండ్రము,రసనాడి రసనాళిక , వంశము అనే రకాలు ఉంటాయి.
సుమతీ శతకంలో
.. చెరుకు తుద వెన్ను బుట్టిన
చెరకున తీపెల్ల చెరుకు
గదరా సుమతీ..అని చెప్పబడింది.ఇంకా..
చెప్పుదినెడి కుక్క చెరకు తీపెరుగునా....
అని చెప్పబడింది.
మన పౌరాణిక కథల్లో మన్మథుడి విల్లు
గా వర్ణించబడిన చెరకు
గురించి మన తెలుగు భాషలో ...చెరకు తోటలోన. చెత్త
కుప్పుండిన కొంచెమైన
దాని గుణము చెడదు.ఛెరకుదిన్న నోరు చేదారగించునా .
చెరుకు రసం కన్న చెలి మాట తీపురా . చెరుకు ఉండే చోటుకు చీమలు తామే వస్తవి.చెరకు వంకర పోతే తీపి చెడుతుందా...వంటి సామెతలెన్నో ఉన్నాయి.
సన్నగా, పొడవుగా, గరుకు అంచులుగల ఆకులుండటం వలన ఆ చెరుకు గురించి...
పర్వమై మన ముందు నిలుచు కాని భారతం
లోని పూర్వం కాదు
తన చూడాలంత తీయదనము దాచు కాని పనసతొన కాదు...
వంటి పొడుపు కథలు మన సాహిత్యంలో ఉన్నాయి.
" చక్కదనమీవు సరసం
బగు డెందము నీది మన్మథుం
డెక్కిడు దివ్య చాపమవు అహినా గుణంబుల ప్రోవువు
అన్నియున్
దక్కెడుగాని యొక్క కొరతన్ సవరించవు
నీకు నీరసం
బెక్కువగు కదా అనుభవించు కొలంది
యు నిక్షుదండమా! "..
..అంటూ...అంటే..
ఓ చెరుకా! నువ్వెంత అందంగా ఉన్నావు. ఆసాంత మధురంగా ఉన్నావు.నీ నిండా రసమే కదా.పైగా మన్మథుడికి అద్వితీయమైన ధనుస్సుని. నీ అన్నీ బలంగానే ఉన్నాయి. కాని నీలో ఒక్కటే లోపం. నిన్ను పిండిన కొద్దీ నీకు నీరసం పెరుగుతుంది....
అంటూ జగన్నాథ పండిత రాయలు చెరకును తెగ మెచ్చుకున్నాడు.
ఇక మన తెలుగు సాహిత్యంలో భాగమైన
బాల సాహిత్యంలోను...
చెన్నా పట్నం చెరుకు
ముక్కా
నీకో ముక్కా నాకో ముక్కా ...అనే బాలల పాటల్లోను స్థానం చాటుకుంది చెరకు
మరి ఒప్పుకుంటారుగా
ఎంత తీయగా ఉందో ఈ చెరకు. ...అని.
వ్యాసకర్త
రాజావాసిరెడ్డిమల్లీశ్వరి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి