కె.వి.ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి మహోత్సవాలు.

 స్థానిక కర్నూలు కె.వి.ఆర్ గార్డెన్ లోని కె.వి.ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లోని లైబ్రరీ ప్రాంగణంలో ఘనంగా  ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి మహోత్సవాలు జరిగాయి.కార్యక్రమంలో కె.వి.ఆర్ హై స్కూల్ ప్రిన్సిపాల్ సాధు శ్రీనివాస రెడ్డి గారు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు.అనంతరం ప్రిన్సిపాల్ సాధు శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడుతూ భారత ఇంజనీర్  శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు సమాజం మరువలేని ఎన్నో కట్టడాలను నిర్మించడం జరిగిందని తెలియజేశారు.విద్యార్థిని విద్యార్థులు కూడా ఉన్నత విద్యను అభ్యసించి మీకు మితరువత రాబోవు భవితరాల వారికి  ఉపయోగపడే ఆవిస్కరనల్లు చెయ్యలన్ని సందేశమిచ్చరు. కార్యక్రమంలో కె.వి.ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపాల్ సాధు శ్రీనివాస రెడ్డి గారు,పాఠశాల లైబ్రేరియన్ బోయ శేఖర్,ఉపాద్యాయులు,విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.
కామెంట్‌లు