కాళోజీ-సాహితీసింధు సరళగున్నాల
తే.గీ*పుట్టి కర్నాటకమ్మున ,పోరుసలిపె
తెలుగు భాషకుయాసకు వెలుగురేఖ
అన్నకాళోజీయాదిలో ననవరతము
నిలిచి పట్టమ్ముగట్టరే తెలుగుకెపుడు

పద్మభూషణుండైవెల్గె వరముచేత
న్యాయశాస్త్రమ్ముల్లో పట్ట నాడుగొనిన
అహములేనట్టి కవిరాజు నంధ్రమందు
నంజలించెద కేలెత్తి నమరరాజ

కామెంట్‌లు