నానీలు;-- స్వేచ్ఛాoశం;-సుమ కైకాల
1. నీ స్వరo
    వినినంతనే
    మీటుతుంది లయగా
    హృదయవీణ!...

2. మనసు అదుపు
    విజయానికి మెట్టు
    ఊహలకు పగ్గాలు
    వినాశనమే!...

3. ఆలోచన 
    మంచిదైతే రహదారి
    అత్యాశయితే
    మునిగేది గోదారే!...

 4. కంటి నిండా
     అశ్రువులే
     తడిసిపోతున్నావా
     కంటిపాప నువ్వే!...

5.  స్నేహమంటే
     నా హృదయస్పందన
     చేరుతుంది నీకు
     నేను చెప్పకుండానే!...

కామెంట్‌లు