సునంద భాషితం-367;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 సారశ్యం... సారస్యం
    ******
సారశ్యానికి,సారస్యానికి  అతి దగ్గరి సారూప్యత కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది.
కానీ రెండింటిలో ఒకే ఒక్క అక్షరం మార్పుతో అర్థం మారుతుంది.
సారశ్యం అంటే యోగ్యత,సరళత్వం.
ప్రతి వ్యక్తిలో ఉండాల్సిన ఉత్తమ గుణమిది.ఈ గుణం ఉన్న వారిలో ఎలాంటి కపటం ఉండదు. మనసా వాచా కర్మణా..ఎలాంటి వంక లేని యోగ్యమైన వ్యక్తిగా గుర్తింపు పొందగలడు.
అలాగే సారస్యం అనేది సౌజన్యానికి,సాధుత్వానికి పర్యాయపదం.
సారస్య హృదయం గల వ్యక్తులు సౌశీల్యం మంచితనం మూర్తీభవించిన వారై అందరిలో ఎంతో గౌరవాన్ని పొందుతారు.మాటతీరు, వ్యవహారం ఎంతో మృదువుగా ,ఎదుటి వారిని నొప్పించకుండా ఉంటుంది.
సారశ్యం, సారస్యంతో జీవనం సాగించే వ్యక్తి యొక్క జీవితం నల్లేరు మీద నడకలా ప్రశాంతంగా గడుస్తుందనడలో ఎలాంటి సందేహం లేదు.
నమస్సులతో 🙏


కామెంట్‌లు