గొప్ప స్థపతి మా శివ నాగిరెడ్డి గారు (42);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9493811322.
 ఒక్కొక్క శిల్పికి ఒక్కొక్క బాణి ఉంటుంది. ఒకరి పద్ధతికి మరొకరి పద్ధతికి సంబంధం ఉండదు. దాదాపు 100 మందిలో 95 మంది  గురువుగారు చెప్పిన పాఠాన్ని అనుసరించి వారి బాణీ కొనసాగిస్తూ ఉంటారు. కానీ శివ నాగి రెడ్డి గారు ఏ గురువు దగ్గర నేర్చుకున్న పాపాన పోలేదు. స్వయంకృషితో  స్వకపోల కల్పితంగా  నిర్మించిన శిల్పాలే తప్ప  ఎవరిని అనుకరించలేదు, అనుసరించలేదు. ఆ అవసరం కూడా వారికి రాలేదు. వారిని నేను ఋషిగా అభివర్ణిస్తాను. ఋషి అంటే  అనుసరించేవాడు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను  తన జీవితానికి అనుసంధానం చేసుకుని దాని ప్రకారం నడిచేవాడు. తన దగ్గరకు వచ్చిన విద్యార్థులకు ఇలా చేయి అలా చేయి అని చెప్పరు. తాను చేస్తున్నదే పాఠం  కుర్రవాళ్ళు దానిని అనుసరించి  ఎన్ని గంటలకు లేవాలి స్నానం ఎలా చేయాలి  భోజనం చేసేటప్పుడు ఎలా ప్రవర్తించాలి. చదివేటప్పుడు  వారు ఎలా ఉంటారో అలాగే మీరు కూడా ఉండాలి. ఆ రోజుల్లో విద్యా విధానం ఎలా ఉందో రెడ్డి గారిని చూస్తుంటే నాకు ఏకలవ్యుడు గుర్తుకొస్తాడు. ఆయన ఎవరి వద్ద నేర్చుకున్నాడు? ద్రోణుని బొమ్మ మాత్రం పెట్టుకున్నాడు  విల్లు ఎలా ఉంటుందో దానిని ఎలా వాడాలో, ఎక్కడా ఎవరు ఎవరికి చెప్పాలో తన సృజనతో తాను  స్వయంకృషితో అభ్యసించింది అయితే ఎంతో కష్టపడి  విల్లుతో అద్భుతాలను సృష్టించిన వాడు ఏకలవ్యుడు.
బాలమురళీ కృష్ణ గారు ప్రపంచం లోనే గొప్ప గాయకునిగా పేరు పొందారు. 8వ సంవత్సరం నుంచి తన విద్యను ప్రదర్శించారు. గురువులకే గురువు అన్న పేరు తెచ్చుకున్నారు వారి వద్ద అనేక మంది శిష్యులు ఉన్నారు. ఎవరికి సరిగమలు నేర్పలేదు. వారు పాడుతూ ఉంటే శిష్యులు విని, చూసి నేర్చుకున్న వారే. వారు వాయించని వాద్యం లేదు. వారికి తెలియని భాష లేదు.
అలాంటి వాడే మా శివ నాగిరెడ్డి. ఇవాళ ఆంధ్ర దేశంలో ఎక్కడ ఏ తవ్వకాలు జరిగినా  అక్కడ దొరికిన శాసనాలను పరిశీలించి  దానిని చదువ గలిగిన నేర్పు సంపాదించారు.  అప్పటి భాష  శాసనాలలో ఉన్న మాటలు  మనం మాట్లాడుతున్న భాషకు కొంచెం భిన్నంగా ఉంటాయి. ఎవరి సహకారం లేకుండానే  ఏ గురువు దగ్గర అధ్యయనం చెయ్యకుండానే  పాళీ భాషలో ఉన్న అక్షరాలను తెలుసుకొని  ఎంతో కృషి చేసి  కృతకృత్యుడు అయిన సాధకుడు మా శివ నాగిరెడ్డి.



కామెంట్‌లు