పరమాత్మ పంచ స్వరూపాలు;-"రసస్రవంతి " & " కావ్యసుధ "7075505464 : 9247313488హయత్ నగర్ - హైదరాబాదు.

 తన భక్తులను కాపాడేందుకై పరమాత్మ పలురూపాలను దరిస్తుంటాడు. అందులో శృతిననుసరించి ఐదు అవతారాలు ముఖ్య మైనవిగా తెలుస్తున్నాయి. పర, వ్యూహ, విభష, అంతర్యామి, అర్చావతారం అనేది ఆ ఐదు ఆవతారాలు ఈ ఐదింటిలో పర , వ్యూహ అవతారాలు సామాన్యులకు అందనవి. విభవ అవతారాలు కాలాంతరంలో వెలిసాయి. అంతర్యామి దర్శనం యోగులకు మాత్రమే సాధ్యం. కాగా ఆర్చావతారం మాత్రమే మనందరికీ దర్శనమిస్తూ పూజలందు కుంటూ మనలను ధన్యులను చేస్తోంది.
1. పరస్వరూపం:  శ్రీవైకుంఠంలో అనంత గరుడ విష్వక్సేనారి నిత్యసూరులచే 
పరివేష్టితమై లక్ష్మీయుతమై ఉండే దివ్యమంగళ స్వరూపం.
2. వ్యూహము: వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అవిరుద్ధ తదితర నామాలతో
గుర్తింపబడుతూ పాలకడలి మధ్యన శేషశాయిపై పవళించి ఈశావ బ్రహ్మేంద్రాది
దేవతలతో, మునీశ్వరులతో సేవించబడుతున్న స్వరూపం.
3. విభవము : శిష్టరక్షణ, దుష్టశిక్షణ, దర్శ సంస్థాపనార్థం దేశకాల పరిస్థితులకు
అనుగుణంగా వెలసే అవతారాలు. రాముడు, కృష్ణుడు వంటివి.
4. అంతర్యామి : సర్వప్రాణుల హృదయాలలో ఉండే స్వరూపం.
5. అర్చావతారం: మనకోసం ఇళ్ళలో, దేవాలయాలలో రథోత్సవాలలో ప్రతిష్టితమై మనలను కరుణిస్తోన్న అమృతమయమూర్తులు.
 వైరాగ్య తైల సంపూర్ణే                                           భక్తివర్తి సమన్వితే
ప్రబోధపూర్ణ పాత్రేతుజ్ఞప్తిదీపం               వ్యలోకయత్
 దీపం చేతనే ఇంట్లో ఉన్న చీకటి తొలగిపోతుంది. అలాగే జ్ఞానజ్యోతి వెలగడానికి భక్తి అనే తైలం ముఖ్యమైనది.
ఆ భక్తి వలన మనం ఆర్చామూర్తిని నేరుగా దర్శించుకుని పొందుతున్నాం 
మన జీవితాలను ప్రగతిమార్గంలో నడుస్తున్నాం.
కామెంట్‌లు