రాముడు, కృష్ణుడు;-మమత ఐలహైదరాబాద్9247593432
కథ:-(కందపద్యాలతో)
************************
హింసలు జేసెడి రాక్షస
కంసుని మేనల్లుడు మరి ఖైదిన బుట్టన్  
కంసుడు హతమార్చేనని
హంస యశోదమ్మ కడకు హరినే జేర్చన్

గడచిన బాల్యంబుపిదప
విడచిన మాతా పితరుల విడిపించుటకై
జడియక కన్నయ్య తరలె
సుడిగుండంబైనకంస శోభను తుంచన్

మృదు బాలుడు గోపాలడు
పదునాలుగు వత్సరముల పసిడి వయసులో
పదిలంబుగజేరుకొనెను
నిదానముగ మేనమామనే వధియించన్

వధగావించిన పిమ్మట
సుధలొలికే నగవుతోడ జూడగ తల్లిన్
విధిబంధనములు తొలగగ 
రధసారధి నెంచి తల్లి రయమున బలికన్

మాధవ మధుసూదన నా
బాధల నిప్పటికినీవు బాపితివయ్యా!
గాధల నెరిగిన దేవా!
శోధన జేయక దయగను సుందర మూర్తీ!

దైవము నీవని దెలియును
దేవుని కింతటి సమయమ దీనులబ్రోవన్
దేవా! నీ బాల్యంబున
జీవించియెయున్నగాని చెరలోనుంటిన్

సంతస మొందెడి భాగ్యం
బంత యశోదకును దక్కి భారిగ మురియన్
చింతల జిక్కిననే నా
వింతలు కొంతైన గనని పేరుకు తల్లిన్

అని దేవకి తన బాధను
వినిపించగ కృష్ణ మూర్తి వివరము తోడన్ 
వినుమనె దేవకిమాతను
కనుమరుగైనట్టి జన్మ గాధల గుట్టున్

త్రేతాయుగమున రాముని
మాతవు కైకేయివమ్మ మరచితి వేమో!
యా తరమున నేరాముని
ప్రీతిగ కౌసల్య గన్న ప్రియ పుత్రుండన్

ఈ కన్నయ్యను పెంచిన
దా కౌసల్యయె యశోధ; తానానాడున్
నే కానల బోవగనే
నాకై పదునాలుగేళ్లు నరకము నొందెన్

వదలక పొమ్మని యంటివి
పదునాలుగు వత్సరములు వనవాసంబున్
బదులుగ సంతోషంబును
కదలక పంచితి యశోధ కన్నయ్యవలన్

అని గతజన్మము చెప్పగ
విని దేవకి తెలియదనగ; వివరణతోడన్
వినుమనె శ్రీకృష్ణుడు ప్రతి
మనుజుని కష్ట సుఖము గతమందలిదనుచున్

ఎవరైనను మరిచెదరని
సవరించుచు పూర్వజన్మ సత్యము జెప్పన్
యవనిన తప్పులు జేసెడి
యవకాశంబుండదనెను యదుకుల తిలకున్


కామెంట్‌లు