లోభితనం ;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ప్రజాకవి వేమనకు  పిసినారితనం అంటే ఒళ్ళు మంట తనకున్న దానిని మొత్తాన్ని దానధర్మాలకు  బిక్షకులకు ఇవ్వమని ఆయన ఎప్పుడు ఎక్కడా ఎవరికీ చెప్పలేదు కానీ స్తోమత కలిగినటువంటి వ్యక్తి ఎదుటి వారి కష్టనష్టాలను తెలుసుకొని వారి బాధలను పరిష్కరించడం కోసం  తనకు చేతనైన సాయం చేయడం మనసున్న మనిషి లక్షణం  అని నమ్మే వేమన  గొడ్డుటావు ను పిసినారి వాడితో పోల్చి అంతా అందంగా రమణీయంగా చెప్పాడు. మనకు అనిపిస్తూ ఉంటుంది  ఒక అందమైన అమ్మాయిని కానీ  ఆనందంగా ఉన్నా  పురుషుని కానీ చూసినప్పుడు  తాను కూడా అలా ఉంటే బాగుంటుంది అనుకోవడం చాలా సహజం  కానీ  మన పెద్దలు చెప్తూ ఉంటారు  పైన పటారం లోన లొటారం  వాళ్లది లోకోక్తి కూడా.నేను అది చేస్తాను ఇది చేస్తాం అని బడాయిలు కొట్టే వాడు ఎవడు కూడా ఏమీ చేయలేదు  తనకు తాను చేసుకోవడం తప్ప  మాటలు కోటలు దాటుతాయి  అని పెద్దలు ఉరికే అనలేదు  అందం అనేది భౌతికం  అది ఈనాడు ఎంతో అందంగా ఉండవచ్చు రేపటికి అది వాడి పోవచ్చు  ఇవాళ ఆనందించి ఆ రోజు అసహ్యించుకుంటామా  ఈరోజు పొగిడి రేపు తెగిడితే  అతనిని పిచ్చివాడని అవగాహన లోపం అని అంటారు తప్ప అతని మాటకు ఏమాత్రం విలువ ఉండదు. అలాగే దాతృత్వం తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్లి  మీ నిజమైన అవసరాన్ని వారికి చెప్పి  మీవల్ల నాకు ఈ సహాయం కావాలి అంటే  అతను తప్పకుండా సాయం చేస్తాడు. ఒకవేళ అతను చెయ్యలేని పరిస్థితి ఏర్పడితే  చేయగలిగిన వారిని పరిచయం చేస్తాడు. అందుకే యాచకుడు అంటూ ఉంటాడు  పెట్టని అమ్మ ఎలాగో పెట్టదు పెట్టే అమ్మకు ఏం పోయేకాలం  అని. అదే పినినారి వద్దకు వెళితే ఏం జరుగుతుంది రేపిస్తాను మాపిస్తాను అని  అతని తిప్పడం తప్ప అతని అవసరానికి ఆదుకునే ఆలోచనే ఉండదు. మీరు పశువుల చూసినట్లయితే  ఆవు కానీ, గేదె కానీ ఏదైనా కావచ్చు అన్నీ ఒక మాదిరిగానే ఉంటాయి  కానీ చూడ్డానికి కొన్ని చాలా అందంగా వుండి దానినే నిమరాలి అన్నంత ఆకర్షణీయంగా ఉంటుంది.  గేదెలు కూడా అంతే. వయసులో ఉన్న గేదె పాలు కూడా బాగానే ఇస్తుంది పాలు తియ్యడానికి చెంబుతో నీళ్ళు తీసుకెళ్లి  పొదుపు కడగడానికి ప్రయత్నం చేస్తే ఏం చేస్తుంది  మూతి పళ్ళు రెండు రాలేట్టుగా తన్నుతుంది. ఈ పిసినారి వాడి వ్యవహారం కూడా ఇలాగే ఉంటుంది అని చెప్పడం  అలాంటి దుస్థితికి మనం  వెళ్లకుండా ఉండాలి అన్న అభిప్రాయంతో ఈ పద్యాన్ని అందించారు వేమన. పోలికలు చెప్పడంలో సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్లు  చెప్పడంలో వేమనకు వేమనే సాటి. వారి పద్యం కూడా ఒకసారి చదవండి.
"గొడ్డుటావు బిదుక కుండగొంపోయిన పాలనీక తన్ను బండ్లు రాల లోభివాని నడుగ లాభంబు లేదయా..."


కామెంట్‌లు