సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 లాలన...లాలస
   *****
లాలన కావాల్సింది కేవలం పసిపిల్లలకేనా ఆలోచిద్దాం...లాలన కావాల్సింది మనసుకు, మనుషులకు కూడా అవసరం.
అసలు లాలన అంటే ఏమిటో చూద్దాం..లాలన అంటే ఓదార్పు,అనుననయం,ఊఱట,సాంత్వనము,సాంత్వము, బుజ్జగింపు,బుజ్జగింత,పరామరిక లాంటి అర్థాలు ఉన్నాయి.
 ఆవేదనతో కుమిలిపోయేవారికి , బాధలతో తల్లడిల్లే వారికి, అనారోగ్యంతో ఇబ్బంది పడేవారికి లాలన కావాలి.
ఒక చిన్న ఓదార్పు మాటతో వారిలో కొండంత ధైర్యాన్ని, ఆశను, ఆత్మవిశ్వాసాన్ని కలిగించవచ్చు.
 ఇక మనసును కూడా అరిషడ్వర్గాలకు లొంగిపోకుండా ఎప్పటికప్పుడు పసిపాపలా బుజ్జగిస్తూ ఉండాలి.
లేదంటే లాలసకు లోనై మనకు దుఃఖాన్ని, బాధను, నలుగురిలో నగుబాటుతనాన్ని తెస్తుంది.
చిన్నయ సూరి మిత్రలాభం కథల ద్వారా లాలసకు లోనైతే ఎలాంటి కష్టాలు వస్తాయో  జంతువుల కథల ద్వారా చెప్పడం చదివాం.
లాలస అంటే ఏమిటో తెలుసుకుందాం... అత్యాస,ఆబ, కక్కుర్తి, గొంతెమ్మ కోరిక,తృష,దురాశ,పేరాస లాంటి అర్థాలు ఉన్నాయి.
లాలసకు లోనుకాకుండా మనల్ని మనం కాపాడుకుందాం.
లాలనతో ఎదుటివారిని సాంత్వన పరుద్దాం.
ప్రభాత కిరణాల  నమస్సులతో 🙏

కామెంట్‌లు
కన్నెగంటి చెప్పారు…
బాగుంది అక్క
కన్నెగంటి చెప్పారు…
బాగుంది అక్క