మా నాన్న!!! ప్రతాప్ కౌటిళ్యా
పాలల్లో నీళ్లలా
తేనేరులో చక్కెరలా
గాలిలో ప్రాణవాయువులా
కలిసిపోయిన మా నాన్న!!!

మట్టిలో మాణిక్యంలా
విత్తనంలో చెట్టులా
ఆకాశంలో నక్షత్రంలా
శరీరంలో ప్రాణంలా ఉన్న మా నాన్న

పంచభూతాలలో కలిసిపోయిన
మా నాన్న!!

మా నాన్న కనిపించాడా మీకు
అని ఎవరిని అడిగినా!!
ఎవరికైతే కనిపిస్తాడో
వాడే మా నాన్న స్నేహితుడు!!?

ఎవరికైతే కనిపిస్తాడో
వాడే మా నాన్న హితుడు ఆత్మీయుడు!!

మా నాన్న మాకు ఇంకా కనిపిస్తున్నాడు
మా నాన్న మాకు ఇంకా వినిపిస్తున్నాడు!!

శత్రువులు కూడా
మా నాన్నను మర్చిపోయా రూ!!
మేమింకా మర్చిపోలేదు!!

దేవుడి ముందు నిలబడి దండం పెడితే
దేవుడు కాదు
మా నాన్న మా ముందు నిలబడుతున్నాడు!

బ్రతికుండగా బంధించి 
కనిపించకుండా చేసిన కాలం ఈ లోకం
ఇప్పుడు
మూడు కాలాలు మూడు లోకాల్లో
మా నాన్న మా కళ్ళ ముందు ఉంటున్నాడు!

జయం అపజయం కోసం పుట్టలేదు
జనన మరణాలు ఆకలి దప్పికల
గురించి ఆలోచించలేదు మా నాన్న!!

జన్మనిచ్చిన పిల్లల కోసం
జన్మించిన తండ్రి గానే మిగిలిపోయాడు!!

మా కణ కణాన్నీ మంచితనంతో నింపి
తన తనువు నిచ్చిన తండ్రి మా నాన్న!!

తను సిలువగా మారి
మమ్మల్ని లోకానికి జీససులుగా
పరిచయం చేసిన మా నాన్నను
మేమింకా మర్చిపోలేదు!!?
===========================

(మా నాన్నగారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ)
------------------------------
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
8309529273
కామెంట్‌లు
Unknown చెప్పారు…
Marvellous Anna.