"భద్రగిరి"లో ఆట బాలోత్సవ వేడుకలు...;-వెంకట్ మొలక ప్రతినిధి:
 
 శ్రీరాముని సన్నిధానంలో బాలల బ్రహ్మోత్సవాలను తలపిస్తున్న ఆట బాలోత్సవాలు...
👉 భద్రగిరిలో లో జాతీయస్థాయిలో ఆట బాలోత్సవాలు.....
🌟 బెక్కంటి శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరం..
🔥 పలు రాష్ట్రాల నుండి వేలాదిగా హాజరుకానున్న బాలబాలికలు...
🌟  పాల్గొన్న ప్రతి ఒక్కరికి పార్టిసిపెంట్ సర్టిఫికెట్....
💥  ఉచిత ప్రవేశం, ఉచిత వసతి ,ఉచిత మధ్యాహ్న భోజనం...
💥 నవంబర్ 12,13,14 తేదీలలో పిల్లలతో  కళకళలాడునున్న శ్రీరాముని కళ్యాణ మండప మైదానం.....
⭐ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత బెక్కంటి శ్రీనివాసరావు కృషిని అభినందిస్తున్న భద్రాద్రి వాసులు...
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో జాతీయస్థాయిలో బాల బాలికలకు నిర్వహించే బాలోత్సవ సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం, ఆట తెలంగాణ సౌజన్యంతో  బెక్కంటి శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నవంబర్ 12, 13, 14 తేదీలలో నిర్వహించే ఆట బాలోత్సవం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
బాలల దినోత్సవ సందర్భంగా జాతీయస్థాయిలో నిర్వహించే ఆట బాలోత్సవం బ్రోచర్ ను ఇటీవల తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు అజయ్ కుమార్ చేతుల మీదుగా హైదరాబాద్ లో ఆవిష్కరించారు. 
తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారిని, దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిగారిని కార్యక్రమానికి తన వెంట తీసుకొని వస్తానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  ఆట నిర్వాహకులకు హామీ ఇచ్చారు.  
👉 బాలోత్సవాలు జరిగే తీరు ఇలా....
నవంబర్ 12 ,13 ,14 తేదీలలో భద్రాచలం లోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం  మిథిలా స్టేడియంలో,  చిత్రకూట మండపము  లో కార్యక్రమాలు జరుగుతాయి.
6 నుండి 16 సంవత్సరాల బాలబాలికలు పాల్గొనే బాలోత్సవాల్లో మొత్తం మూడు కేటగిరీలలో పోటీలు నిర్వహిస్తారు. 4-6 వయస్సు గల వారిని  సబ్ క్యాటగిరీ గా 7-10 వయసు గల వారిని జూనియర్స్ గా 11-16 వయసు గల వారిని సీనియర్ గా విభజించారు.
మూడు రోజులు పాటు నిర్వహించే ఈ బాలోత్సవాల్లో నాలుగు మొత్తం 24 అంశాల్లో,44 విభాగాలలో పోటీలు ఉంటాయని, నవంబర్ 12న 19 విభాగాలు, 13న 
16 విభాగాలు, 14న 9 విభాగాలు లో పోటీలు నిర్వహిస్తారు.
👉 విజేతలకు బహుమతులు ఇలా...
మూడవరోజు ముగింపు సమావేశంలో 24 అంశాలలో  ప్రథమ,ద్వితీయ, తృతీయ స్థానాలు కైవసం చేసుకున్న విజేతలకు షీల్డ్ ,సర్టిఫికెట్ ను విశిష్ట అతిధుల చేతుల మీదుగా అందించబడతాయి.
👉 ఉచిత వసతి సౌకర్యం ఇలా....
ఆట బాలోత్సవంలో పాల్గొనే పిల్లలందరికీ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం  తానిషా కళ్యాణం మండపం పై గల ఉచిత డార్మెటరీ హాళ్లు అందుబాటులో ఉన్నాయి. ఉచిత డార్మెటరీ హాల్స్ లో వసతి తీసుకునే వారు విధిగా వారి వెంట ఒక దుప్పటి, వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి.
👉  నగదు చెల్లింపు పై వసతి అందుబాటు..
ప్రత్యేకంగా రూములు కోరుకునే వారికి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఏసీ, నాన్ ఎసి రూములు కనీస రుసుముతో అందుబాటులో ఉన్నాయి వివరాలకు 78 93 63 78 84 సంప్రదించగలరు
👉  ఉచిత భోజనం ఇలా...
ఆట బాలోత్సవానికి హాజరయ్యే పిల్లలందరికీ, డాన్స్ మాస్టర్ లకి ఉచితంగా ప్రాంగణంలోనే మధ్యాహ్న భోజనం ఏర్పాటు ఉంటుంది. ముందుగా పిల్లలు, డాన్స్ మాస్టర్లు భోజనం చేసిన తర్వాత అవకాశాన్ని బట్టి పెద్దలకు భోజన వసతి కల్పించబడును.  
👉  భక్త రామదాసు కీర్తనలపై బృంద నృత్య ప్రదర్శన....
నవంబర్ 12 తేదీ న కార్యక్రమ ప్రారంభ వేడుకకు ముందు కార్యక్రమానికి హాజరయ్యే కూచిపూడి ,భరతనాట్యం, గిరిజన సాంప్రదాయ నృత్యాలు, జానపద కళాకారులచే ఏకకాలంలో భక్త రామదాసు కీర్తనలతో బృంద నృత్యం నిర్వహించి వెంటనే నృత్యం లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందన పత్రాన్ని అందించబడును.
👉 ప్రముఖ అంతర్జాతీయ నృత్య కళాకారిణి దంపతులచే నృత్య ప్రదర్శన...
నవంబర్ 13 ,14 తేదీలలో భద్రాచలంలో నిర్వహించే ఆట బాలోత్సవ కార్యక్రమాలలో ప్రముఖ అంతర్జాతీయ సేవా, భావ కళాకారులు ముంబై కు చెందిన అంతర్జాతీయ కళా దంపతులు డాక్టర్ మోహన్ ,డాక్టర్ రాధా మోహన్ కార్యక్రమానికి హాజరై ముగింపు వేడుకల్లో తొలిసారిగా అంతర్జాతీయ స్థాయి నృత్య ప్రదర్శన నిర్వహించి ఆహుతులను ఆనందపరచనున్నారు.
👉  ప్రభుత్వ ,ప్రైవేటు పాఠశాల విద్యార్థుల ఆలోచనలు పరస్పర మార్పిడి వేదిక....
దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల పరస్పర ఆలోచనలు మార్పిడి, స్నేహభావం  పెంపొందించు కోవటానికి జాతీయస్థాయిలో గత దశాబ్ద కాలము నుండి వేదికను ఏర్పాటు చేసినట్టు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు, ట్రస్ట్ చైర్మన్ బెక్కంటి శ్రీనివాసరావు తెలిపారు.
పాఠశాలలో పాఠ్యప్రణాళిక, సహ పాఠ్య కార్యకలాపాలపై ఉన్న విషయాలను ఒకరినొకరు చర్చించుకునే వేదిక ఆట బాలోత్సవ్వాలని,కాబట్టి దేశంలో ఉన్న ప్రతి ఉపాధ్యాయుడు పిల్లల్లో ఉన్న అంతర్గత సామర్ధ్యాలను వెలికి తీయాలి అంటే,వారికి స్వేచ్ఛ వాతావరణం కల్పించాలంటే, వారిని ఆట బాలోత్సవాలకు తీసుకొని రావాలని ఉపాధ్యాయులకు, పాఠశాల  కరస్పాండెంట్లకు పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో జాతీయస్థాయిలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో నిర్వహించే ఆట బాలోత్సవాలు బాల బాలికల, తల్లిదండ్రుల హృదయాలలో చిరస్థాయిగా ఒక తీపు గుర్తుగా నిలిచిపోతుందని ఆశాభావాన్ని *ట్రస్ట్ చైర్మన్  బెక్కంటి వ్యక్తం చేశారు.           
👉  పేర్ల నమోదు ఇలా....
బాలోత్సవంలో పాల్గొనేవారు తమ పేర్లను తమ డాన్స్ మాస్టర్లు ద్వారా మాత్రమే 98 48 35 13 70 / 79 81 93 54 77 కు  సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఫోన్ చేసి నమోదు చేసుకోవచ్చు.. 
👉  లక్కీ డిప్...
ఆట బాలోత్సవానికి హాజరయ్యే పిల్లలు  కళాకారులు  తల్లిదండ్రులు, ప్రేక్షకులు అందరికోసం  హోమ్ నీడ్స్ భద్రాచలం వారి సౌజన్యంతో ముగింపు సమావేశంలో లక్కీ డిప్ నిర్వహించి  ప్రధమ, ద్వితీయ ,తృతీయ  "డ్రా" ద్వారా విజేతలకు బహుమతి ప్రధానోత్సవం ఉండను.
👉  బాలోత్సవానికి అందరి మద్దతు..... 
భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో పవిత్ర పుణ్యక్షేత్రంలో జాతీయ స్థాయిలో నిర్వహించే ఆట బాలోత్సవాలు విజయవంతం చేయుటకు  భద్రాచలంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థలు మద్దతు ప్రకటించారు. కరోనా తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా నవంబర్ నెలలో భద్రాచలంలో నిర్వహించే ఆట బాలోత్సవాలు చరిత్రలో నిలిచేలా తమ వంతు సహాయ  సహకారాలు అందిస్తామని ఇటీవల భద్రాచలం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి  కరపత్రాన్ని ఆవిష్కరణ చేసి నిర్వాహకులకు హామీ ఇచ్చారు.
👉 క్రమశిక్షణ, భద్రత పాటించాలి...
కార్యక్రమానికి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు, ప్రాంగణంలో ప్రతి ఒక్కరు కచ్చితంగా క్రమశిక్షణ పాటించాలి... ఎవరి భద్రత వారే చూసుకోవాలి... భద్రత విషయంలో నిర్వాహకులకు ఏ సంబంధం లేదు పూర్తి బాధ్యత మీదే... నిర్వాహకులు తెలిపారు.



కామెంట్‌లు