మనకీర్తి శిఖరాలు ;-;గోరటి వెంకన్న . . -డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 ముఖ ప్రజాకవి, గాయకుడు. పల్లె ప్రజలు, ప్రకృతి ఆయన పాట లకు మూలాధారాలు. మా టీవీలో ప్రసారమైన రేలా రె రేలా కార్యక్రమానికి సుద్దాల అశోక్ తేజతో కలిసి న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. 2016లో తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నుండి కాళోజీ సాహిత్య పురస్కారం, వల్లంకి తాళం పుస్తకానికి 2021లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నాడు. 2020, నవంబరులో శాసనమండలి సభ్యుడిగా (గవర్నర్ కోటా) ప్రమాణ స్వీకారం చేశాడు. 
గోరటి వెంకన్న 1963 లో నాగర్‌కర్నూల్ జిల్లా, గౌరారం (తెల్కపల్లి)లో ఆయన జన్మించాడు. నాన్న పేరు నర్సింహ. అమ్మ ఈరమ్మ. తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు.
చిన్నతనంలో ఆయనకు సినిమా పాటలంటే చాలా చిన్న చూపు ఉండేది. బడిలో పాట పాడమంటే ఎక్కువగా భక్తి పాటలు పాడేవాడు. ఆయన తండ్రి కూడా మంచి కళాకారుడే. తల్లి కూడా మంగళ హారతులూ మొదలైన పాటలు పాడేది. అలా ఆయనకు చిన్నప్పటి నుంచీ పాటల మీద ఆసక్తి కలిగింది. అలా ఉండగా ఆయన ఊర్లో వామపక్ష భావాలున్న వెంకటరెడ్డి అనే మాస్టారు వెంకన్న లోని సృజనాత్మకతను గుర్తించి కొన్ని పాటల పుస్తకాలను తీసుకువచ్చి ఇచ్చాడు. వాటిలో పాటలను ఆయన అలవోకగా పాడేవాడు.
రైతుల సమస్యలపై పాటలు రాస్తున్న సమయంలో 1984 లో ఆయన రాసిన నీ పాట ఏమాయెరో నీ మాట ఏమాయరో అనే పాట చాలా పేరు సాధించిపెట్టింది. ఆయనను చిన్నతనంలో ప్రోత్సహించిన వెంకటరెడ్డి మాస్టారు ప్రోత్సాహంతో కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో పాలుపంచుకోసాగాడు. అదే ప్రభావంతో అనేక పాటలు రాశాడు. అలా ఆయన రాసిన పాటలు జన నాట్యామండలి వాళ్ళు సభల్లో పాడేవారు.
రాజ్యహింస పెరుగుతున్నాదో
పేదోళ్ళ నెత్తురు ఏరులై పారుతున్నదో
అనే పాట ప్రముఖ సినీ దర్శకుడు ఎన్.శంకర్ వినడం తటస్థించింది. ఆయన ఈపాట రాసింది ఎవరా అని రెండు నెలలపాటు వెతికి పట్టుకున్నాడు. శంకర్ ఆయన్ను సినిమా కోసం పాట రాయమని అడిగితే నిర్లక్ష్యంగా చూశాడు. సినిమా పాటలన్నీ పడికట్టు పదాలతో రాయబడి ఉంటాయనీ సినిమాల వల్ల సమాజంలో మార్పు రాదనే అభిప్రాయంతో ఉన్నాడు. చివరకు మిత్రుడు సాహు ఇచ్చిన ట్యూన్ తో జై భోలో జై భోలో అమరవీరులకు జై భోలో అనే పాటను రాశాడు. అది బాగా హిట్టయింది. అలాగే "కుబుసం" సినిమా కోసం ఆయన రాసిన పల్లె కన్నీరు పెడుతోంది అనే పాట కూడా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
రచనలు.
1994 - ఏకనాదం మోత
2002 - రేల పూతలు: ఎవరికో కొన్ని వర్గాల వారికి మాత్రమే అర్థమై, పరిమితమైన కవితా సంకలనాలకు నేడు కొదువ లేదు. కాని సామాన్య జనానికి అర్థమై, వారి నాలుకల మీద నిలిచిన సజీవమైన కవిత పాటే కదా! ఆ పాటలే నేడు కరువైనాయి. ఆ కరువును తీర్చడానికే మూడు పాటల సంకలనాలు వెలువరించాడు గోరటి. వాటిలో రేలపూతలు ఒకటి. ఈ పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ గేయ సంపుటి పురస్కారం వచ్చింది.
2010 - అల చంద్రవంక: 'హంస' అవార్డు, గండ్ర హన్మంతరావు స్మారక సాహితీ పురస్కారం
2016 - పూసిన పున్నమి
2019 - వల్లంకి తాళం: కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
రవినీడ
సోయగం
పాతకతే నా కథ
పల్గాడి
పురస్కారాలు.
కాళోజీ నారాయణరావు పురస్కారం - 09.09.2016
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం - 2021 
గుమ్మడి వెంకటేశ్వరరావు అవార్డు (2018)
లోక్నాయక్ పురస్కారం, జాలాది జాతీయ పురస్కారం, శిఖామణి కవితా పురస్కారం (2017)
బొల్లిముంత శివ రామ కృష్ణ పురస్కారం (2017)
సుద్దాల హన్మంతు జానకమ్మ జాతీయ పురస్కారం (2017)
విశాలాక్షి పురస్కారం (సాహితీ పత్రిక, నెల్లూరు)
గండే పెండేరం కవి రాజు బిరుదు (సంతు రవి దాస్ ట్రస్ట్ 2008)
లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు (2009లో తనికెళ్ళ భరణి స్పృహ సాహితీ సంస్థ, కోదాడ)
లంకేష్ అవార్డు నేలాద నక్షత్ర బిరుదు (లంకేష్ స్మారక కమిటీ)
సదాశివ పురస్కారం (2005)
గుడిహాళం రఘునాధం పురస్కారం (2012)
టాల్, లండన్ & (అట్టా యుఎస్ఏ) (లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు)
ఆట, యుఎస్ఏ (లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు)
విశాలాంధ్ర విజ్ఞాన సమితి పురస్కారం, 2002
వెంకన్న రాసిన 'పల్లె కన్నేరు పెడుతుందో...' పాట ఆంగ్లంలోకి అనువదించబడి, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ ప్రచురణలలో స్థానం పొందడంతోపాటు ఉస్మానియా యూనివర్సిటీ బిఏ విద్యార్థులకు, 5వ తరగతి తెలుగు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓపెన్ స్కూల్ సిలబస్‌లో పాఠ్యాంశంగా చేర్చబడింది.
ఉస్మానియా, ఇఫ్లూ, ఉర్దూ మొదలైన విశ్వవిద్యాలయాలలో వెంకన్న రచనలపై పరిశోధనలు (గోరటి వెంకన్న సాహిత్య పరిశోధన, చారగొండ వెంకటేష్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయం పిహెచ్.డి) జరిగాయి.
గోరటి వెంకన్న కవితా పరామర్శ (పెన్నా శివరామకృష్ణ)
వెంకన్నపై 'రాత్రి ప్రవచనం' అనే డాక్యుమెంటరీని అమర్ కుమార్ రూపొందించాడు. ఇది ఇటాలియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డును గెలుచుకుంది.
యుఎస్ఏ, యుకె, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, కువైట్, దుబాయ్, సింగపూర్ మొదలైన దేశాలు సందర్శించాడు.

కామెంట్‌లు