పరిశీలన - . స్పందన
పరిశోధన - ప్రతిస్పందన
ఈ ప్రత్యేకతలే... కవుల్నీ, రచ యితల్నీ,సామాన్య జనంనుండి
వేరుచేసి... ప్రత్యేక స్థానాన్నిచ్చి
సాహితీ వేత్తగా... గుర్తింపుని,
గౌరవాన్నీ కలిగించేవి... !
సాహితీవేత్తఅనేవారు...సామాజికస్థితి,గతులనుకూలంకశంగా
పరిశీలించి,బాధ్యతాయుతమైనపౌరునిగా స్పందించి, ఉచితా నుచితాలను పరిశోధించి... త ప్పులనువేలెత్తి చూపుతూ,తన
ప్రతిస్పందనా సాహిత్య ప్రక్రియ లతో సామాజిక లోపాలను సవ రించే ప్రయత్నం చేస్త్తారు !
సాహితీవేత్తలు అంటే... ద్రష్టలు
సామాజిక వినాశాలను అడ్డు కుని, వికాసానికి దోహద పడే
స్రష్టలు...!సమాజానికిఅత్యావ శ్యకులైన విశిష్ట వ్యక్తులు వీరే !
సమాజం, అందరికీ ఒకేలా కని పించి,వినిపించినా...వీరుప్రత్యే కమైనదృష్టికోణంలో పరిశీలిస్తా
రు... ! వీరి జ్ఞానేంద్రియాలకున్న
ప్రత్యేకతే అది...!! సామాన్యుల
కంటే వీరిలో ఉన్న అతీంద్రియ శక్తి వీరిని లా నడిపిస్తుంటుంది
కనుకనే వీరిలో ఇంత ప్రతిభ ప్రకటితమౌతుంటుంది...!
జ్ఞాన వితరణ గావించేఉపాధ్యా యులు, బహుముఖ ప్రజ్ఞావిశా రధులైన వైద్యులు... న్యాయా న్యాయాలను వాదించేలాయర్లు
ధర్మంగా తీర్పులు చెప్పేన్యాయ
మూర్తులు,చట్టాలనుచేసేశాసన
కర్తలు...చట్టాలను అమలుచేసే
కార్యకర్తలు వీరందరి సమిష్టి, స మగ్ర స్వరూపమే సాహితీవేత్త !
వీరందరూ ప్రత్యక్షంగా చేసే సేవలు, సాహితీవేత్త ఒక్కడే పరోక్షంగా నెరవేరుస్తున్నాడు !
సాహితీవేత్తఅంటే...మూర్తీభవించిన మానవత్వం !
చైతన్య స్ఫూర్తి - నవ్య దీప్తి,
నవ సమాజ నిర్మాత,సత్సమా
జగతివిధాత !
నారాయణాంశ తో రచనలను,
సాక్షాత్తూ ఆ త్రినేత్రుడైనపరమ
శివుని అంశతో, కవిత్వాన్నీ.....
సాక్షాత్తూ బ్రహ్మయే తానై, సాహిత్య సృజన గావించే వీరు
త్రిమూర్త్యాత్మకులు... !
సాహిత్యం లేని సమాజం, జీవం లేని శరీరం లాంటిది !
సాహిత్యం తన ఉనికినిచాటు
కునేది,అస్తిత్వాన్నినిలబెట్టుకునేదీ కూడా ఈ సమాజం ద్వారా నే..!ఇది అవినాభావసంబంధం
ఉత్తమ సాహిత్యం మూలంగా నేసమాజవికాసము,పురోభివృద్ధి...!
పదార్ధ స్వరూపు సమాజానికి
చైతన్యశక్తి సాహిత్యమే !!
కార్య, కారణ సంబంధాలను
బేరీజు వేసి, సమాజ అహితకా ర్యాలకు కారణాలను విశ్లేషించి
వాటిని నిరోధించి, నిర్మూలించే గట్టి ప్రయత్నాలను సాహితీ వేత్తలైన కవులు, రచయితలు చేస్తారు... !
వీరు ప్రయోగించేఅక్షరశరాలు
దివ్యాస్త్ర శస్త్రాలై... చెడుపై పో రాడి... మంచికి విజయాలను చేకూర్చుతాయి అన్నది చరిత్ర చెబుతున్న తిరుగులేని సత్యం!
అనేక దివ్యశక్తులసమిష్టి సమ
గ్ర స్వరూపాలే...
. సాహితీ వేత్తలు !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి