మరుగున పడిన మహనీయులు! అచ్యుతుని రాజ్యశ్రీ
 చక్రవర్తుల రాజగోపాలచారి (రాజాజీ) సనాతన వైష్ణవ కుటుంబం లో పుట్టినా పరమతసహనం గలవాడు. ఆయన కారుడ్రైవరు ముస్లిం! బిలియర్డ్స్ టెన్నిస్ ఆటల్లో మేటి! సేలంలో కారున్న ఏకైక లాయర్ రాజాజీ! తన కూతురు  లక్ష్మిని గాంధీజీ కొడుకు దేవదాసు కిచ్చి పెళ్ళి చేయటం ఆరోజుల్లో గొప్ప సంచలనం! మున్సిపల్ బడిలో అస్పృశ్యత కి అడ్డుకట్ట వేశాడు.తొలి భారతీయ గవర్నర్ జనరల్ గా 1948లో గద్దె పై కూచున్న నేత! మంచి హాస్యప్రియుడు.ఓఆంగ్లేయుడు"ఏంటీ!ఈరోజు ఎండ బాగా ఉంది?" అనగానే వెంటనే రాజాజీ అన్నమాట ఇది" మీశీతలదేశానికి తట్టాబుట్ట సర్దుకోమని మాసూర్యుడు వార్నింగ్ ఇస్తున్నాడు." తొలి భారతరత్న అవార్డు అందుకున్నాడు. 85ఏళ్ళ వయసు లో  యు.ఎస్.ప్రెసిడెంట్  కెనడీ దగ్గరికి వెళ్లి అణ్వాయుధాలు నిషేధించాలని నొక్కి వక్కాణించాడు. ఆంగ్లం లో కథలు పిల్లల కోసం రామాయణ భారతాలు  ఆంగ్లంలో రాశాడు.తన94వ ఏట 1972 లో అమరుడైనాడు.
ఎస్.ఎ.డాంగేమహామేధావి వక్త! భారత కమ్యూనిస్టు కార్మిక ఉద్యమనేత! ఉషాతాయి భావే అనే వితంతువుని పెళ్లాడాడు.1957 లో ఎం.పి.గా భారీ మెజారిటీతో గెల్చి నెహ్రూ కి  చురకలు అంటించేవాడు."మిష్టర్ నెహ్రూ! ఇంతవరకూ ధృతరాష్ట్రుడి పాత్ర పోషించావు.ఇప్పుడు అశ్వత్థామ కూడా అయ్యావా?" అని అంటే లోక్సభ అంతా ఘొల్లుమంది.నెహ్రూ కూడా హాయిగా నవ్వాడు. 
శ్రీతెన్నేటి విశ్వనాథం గుడిలో అర్చకులకి"నాది ఆంధ్ర-తెలుగు గోత్రం" అని చెప్పేవారు. ఎం.ఎ.బి.ఎల్.మద్రాసు హైకోర్టులో అడ్వకేట్. గాంధీజీ పిలుపుతో స్వాతంత్రోద్యమంలోకి దూకారు. ప్రకాశం బ్యారేజి  తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీ కై కృషిచేసి సాధించారు.సంస్కృత పాళీ తమిళ భాషల్లో పండితుడు. 1979లో విశాఖ ఎల్.ఐ.సి.భవనాలు ప్రారంభించి సారస్వత వేదికలో పాల్గొని  ఆరాత్రే గుండె పోటుతో మరణించారు. 
గుల్జారీలాల్ నందా నెహ్రూ  శాస్త్రిజీల మరణంతర్వాత కేవలం 14 రోజులు ఆపధర్మ ప్రధానిగా  ఉన్న  నిష్కల్మష జీవి.కుత్సితం కుతంత్రాలు ఎరగడు.రైల్వే మంత్రిగా తన కుటుంబానికి టికెట్లను కొన్నారు.వారిని మామూలు బోగీలో కూచోబెట్టి తన బోగీలో ఒంటరిగా పయనించారు.ఇద్దరు కొడుకులు ఆయనమొహం చూడలేదు. అద్దె ఇంట్లో తుప్పు పెట్టెతో ఇంటి యజమాని బైటకి గెంటితే పన్నెత్తి  మాటాడని అతి మంచి మనీషి! కోమాలో ఉన్న  తండ్రికి  కూతురు డాక్టర్ పుష్పాబెన్ సేవచేసింది.
మిటమిటలాడే ఎండలో మలమలమాడుతూ ఓవృద్ధురాలు చెమటలు కక్కుతూ గడ్డిమోపుని నెత్తిన పెట్టుకుని నడుస్తోంది. ఓకారు ఠక్కున ఆమెపక్కనే ఆగింది.కార్లోంచి దిగిన ఆవ్యక్తి" అమ్మా!కారెక్కు.డిక్కీలో గడ్డి మోపు పెట్టిస్తా" అన్నాడు. "నాయనా! చిన్నప్పటి నుంచి నాకు ఈపని అలవాటే! గవర్నమెంట్ కారుకదా? నీపని చూసుకో"అంది.ఆకారు దిగిన వ్యక్తి  అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి దామోదరం సంజీవయ్య.ఆమె ఆయన కన్నతల్లి సుంకలమ్మ!! దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి!6లక్షల ఎకరాల బంజరు భూముల్ని వ్యవసాయ కూలీలకు పంచి కార్మికులకు బోనస్ పద్ధతిని అమల్లోకి తెచ్చారు 🌹

కామెంట్‌లు