మన భాష తెలుగు;-తెలుసుకుంటే వెలుగు;-రాజావాసిరెడ్డిమల్లీశ్వరి
తెలుగు ఒడిలో ...22

గడ్డి
తయ
ఇది భూజమే అంటే భూమి నుండి పుట్టినదే...కాని చీకట్లో భయపెట్టే మర్రి చెట్టంత పెద్దది కాదు.చిన్న చిన్న కొమ్మలుంటాయి  కాని
పెద్ద మాను కాదు. తన పచ్చదనంతో మన కళ్ళకు విందు చేస్తూ...మెత్తని తివాసీలా మన కాళ్ళ 
కింద నలుగుతూ.. తన పూల కాంతితో ప్రకృతికి
సౌందర్యమందిస్తూ..చూపరులకు ఆహ్లాదాన్నిచ్చే దే...అది.
అదే ...గడ్డి.

   ఈ గడ్డిని. అర్జునము,
కవను,కసవు,గరిక, గాదము,తృణము, పచ్చిక, పరక, పూరి,పుల్ల, పోకు, పోచ
మృగప్రిరము....ఇలా ఎన్నెన్నో పేర్లతో  పిలుస్తారు. ఈ గడ్డిని దట్టంగా పెంచే ప్రాంతాన్ని పచ్చిక బైలు, 
శాద్వలము అని అంటారు. ఏటి ఒడ్డున పెరుగుతూ తన తెల్లని పూలతో..ముఖ్యంగా
వెన్నెల్లో అందాన్ని ఆరబోసే రెల్లు గడ్డిని మనం చూస్తూనే ఉంటాం.

   ఈ గడ్డిని ఉలపము, ఉంచు,గొడుగు గడ్డి అని పిలువబడే గుడ్డి కామంచి, కాకిచెరకు నక్కతోకపొన్న,గమ్మత్తు తుంగ,వసంత గంధం
నీవరి, మల్లయ కరివేల, మెరుగు గడ్డి యజ్ఞ జాగారము  వంటి పలురకాలుగా ఉంది.

  గడ్డికున్న అనేక పేర్లను చూచినప్పుడు ఆ పేర్లతో వచ్చే అనేక పదాలను చదివినప్పు
డు ఎంతో విషయ విజ్ఞానం  అందుతుంది
మనకు .గడ్డిని తృణము అంటారని తెలుసుకున్నాం కదా ఆ  పదంతో కలిసి ....
అగ్ని రకాలలో ఒకటైన బడబాగ్నిని "తృణదుహతు" అని,
అగ్ని భేదాలలో ఒకదాన్ని "తృణాగ్ని" అని, ,కారకాలు తీవలలో ఒకటైన మానేరుడ తీగను " తృణ జ్యోతి" అని అంటారు.

కుండలు మొదలైన
వాటిని  కదలకుండా ఉంచటానికి  వాటి కింద ఉంచే కుదురు గడ్డితో చేయబడుతుంది.అందు వలన ఆ కుదురును 
" గడ్డి బొద్దు " అని అంటారు‌.
 ఆయూధాలలో ఒకటైన ..బాణ
ప్రయోగానికి మూలమైన  విల్లును
"తృణతి అని, అగ్ని సూత్రం అనే దానిని
" దర్భ మొలతాడు" అని అంటారు. గడ్డి జాతికే చెందిన తాడిని
"తృణ ద్రుమంఖ" అని,
ధ్వజాకారంలో ఉంటుంది కనుక 
వెదురును "తృణధ్వజం" అని అంటారు,

" పూవు పూస్తుంది
కాయ కాస్తుంది
గువ్వ కూర్చోను
కొమ్మా లేదు " అంటూ
గడ్డి జాతికే చెందిన 
వరిమొక్క గురించి పొడుపు కథలు ఉన్నాయి.

పొలాలు, ఇళ్ళు మొదలైన చోట్ల 
మని‌షి ఆకారంలో గడ్డితో బొమ్మలను  చేసి దిష్టి తగలకుండా ఉంచే
గడ్డి బొమ్మను " తృణపూలి" అని అంటారు. ఇంకా..
గారికి ఊగుతుంటాను
చేతులు చాపి ఉంటాను
చేనుకుకావాలి కాస్తాను
దిష్టిబొమ్మను నే గడ్డి బొమ్మను .అనే బాల గేయం ఉంది

.మన తెలుగు సాహిత్యంలో ఈ గడ్డిని గురించి...
గడ్డి వేయ పోట్లగొడ్డు 
కొమ్మా డించు,
గడ్డి వెంటబట్టికట్టరే
యేనుంగు,
గడ్డివామిలో సూది వెదికినట్లు,
పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది....
వంటి సామెతలెన్నో ఉన్నాయి.

ఒక వ్యక్తి స్వభావాన్ని, విలువను తెలిపే సందర్భంలో " వాడా గడ్డిపోచ వంటి వాడు" అని అనటం మనం
వింటూ ఉంటాం.

తుఫాను  వేళ తలవంచి తుఫాను పోగానే  తలెత్తి నిటారుగా నిలబడుతూ
మనిషికి ధైర్యాన్ని, స్ఫూర్తిని అందించే ...
నేర్పే గురువు  గడ్డి.

కాగితపు పూలకన్న
గడ్డి పూలు మేలు..అని
అనిపించుకున్న ఈ గడ్డి...గడ్డి పూలు  తాము ఎంతో తక్కువ ..విలువ లేదు.  ..అని బాధ పడకుండా సమయానుకూలంగా బతికే విధానాన్ని, జ్ఞానాన్ని ఎంతగా బోధిస్తాయో చూశారుగా.
మరి గడ్డే కదా అని తీసి పారేయకండి.ఆ ఎండు గడ్డినో. .. .. పచ్చిగడ్డినో తినే పశువులిచ్చే పాలనే మనం తాగుతున్నామని మరచి పోకూడదు.

 


కామెంట్‌లు