సుప్రభాత కవిత ; -బృంద
మనసులోని  రూపాలు
మౌనంగా నవ్వుతూ
గుండెలోని సొదలన్నీ
కదలకుండా వింటాయి

తరచి  తరచి చూసుకుంటే
ఎదను తడిపి పోతాయి

మనసు మీటే మమతలన్నీ
మధురగానం  చేస్తాయి.

కన్నీటి కొలనులోని
కలువలన్నీ కలలుగా 
కనుల నిండి నీరై
కరిగి కురిసిపోతాయి

నిశీధిలో
తలపులన్నీ
నిలువునా దాచేసే
ఉషోదయపు వెలుగులు...

మబ్బులతో దోబూచులు
మనసులతో సయ్యాటలు

జలతారంచులా
మిలమిలా మెరిసే

మధుర భావనల
పరిమళాలు పంచుతూ

పల్లవించే హృదయంలో
ప్రభవించే ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు