* చెన్నావారి ముత్యాల హారాలు* పుస్తకావిష్కరణ

 ఉట్నూరు సాహితీ వేదిక ఆధ్వర్యంలో ముత్యాలహారం ప్రక్రియలో * చెన్నావారి ముత్యాల హారాలు* పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం ఉట్నూరులోని సాహితీ వేదిక కార్యాలయంలో జరిగింది. ఖమ్మం జిల్లా పాల్వంచ వాస్తవ్యులు చెన్నరావు గారి ద్వారా రచించబడిన ముత్యాల హారాలు పుస్తకాన్ని రూపకర్త. కవి, రచయిత ఉపన్యాసకులు, పూర్వ అధ్యక్షులు శ్రీ,రాథోడ్ శ్రావణ్ గారి సారథ్యంలో ఉట్నూరు సాహితీ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన  గౌ, శ్రీ,Dr.మెస్రం మనోహర్ గారు మాట్లాడుతూ సాహితీరంగంలో "ముత్యాలహారం" అనే ప్రక్రియ అనేక మంది కవులు గొప్ప వరమని కొనియాడడం జరిగింది. ఉ సా వే పూర్వ అధ్యక్షులు కట్టా లక్ష్మణ చారి గారు మాట్లాడుతూ ఉట్నూరు నుండి ఓ సాహితీ ప్రక్రియ వెలువడి సాహితీరంగంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభంజనం సృష్టించడం నిజంగా చాలా సంతోషకరమైన విషయమని శ్రావణ్ రాథోడ్ గారిని అభినందించడం జరిగింది. ఉ సా వే అధ్యక్షులు కవన కోకిల బంకట్లాల్ జాదవ్ గారు మాట్లాడుతు ముత్యాల హారం అనే ప్రక్రియ ద్వారా ఇప్పటి వరకు ఉట్నూరు సాహితీ వేదిక ఆధ్వర్యంలో అనేక పుస్తకాలు వెలువడడం శుభ సూచకం అని కొనియాడుతూ ఉట్నూరు కవుల నుండి కూడా ముత్యాల హారాలు ప్రక్రియలో కవితలు రాసి పుస్తకాల రూపంలో తీసుకురావాలని అలాంటి కవులకు ఉ సా వే ద్వారా సహకారం అందిస్తామని పిలుపునిచ్చారు..
ఈ కార్యక్రమంలో ఉ సా వే ప్రధానకార్యదర్శి ముంజం జ్ఞానేశ్వర్, భట్టుశ్రీ మురళీ జాధవ్, ప్రచార కార్యదర్శి ఆత్రం మోతీరాం, బంజారా రచయితల వేదిక అధ్యక్షులు డా" ఇందల్ సింగ్ బంజారా,   దేవావత్ ధరంసింగ్, పవార్ వినోద్, ముంజం మల్లికార్జున్, చౌహాన్ సంజీవ్ గార్లు పాల్గొన్నారు..
కామెంట్‌లు