*కార్తీకదామోదర మీనాక్షీ సుందరేశ్వరుల అనుగ్రహం పరమేశ్వర ఆత్మబంధువులు అందరకీ కలగాలని ప్రార్ధిస్తూ......*
🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔
బ్రహ్మ, నారద సంవాదంలో.....
*పార్వతీ హిమవంతుల స్వప్నము - శివుని చేత అంగారక గ్రహ ఆవిర్భావ ప్రసంగము*
*నారదా! నీవు నీ ఇంటికి వెళ్ళిన తరువాత కొంతకాలం గడచింది. ఒకరోజు మేనక, హిమవంతుని వద్దకు వెళ్ళి, మహారాజా! మన కుమార్తె వివాహం విషయంలో నారద మహర్షి చెప్పిన విషయాలు నాకు అర్థం అవలేదు. కానీ, మీరు మన అమ్మాయిని తగిన వరునికి ఇచ్చి వివాహము జరిపించండి. ఈ వివాహము వలన మనము, ఈ సమస్త లోకాలకు కూడా మంచి జరగాలి అని నేను కోరుకుంటున్నాను " అని చెప్పింది. అప్పుడు హిమవంతుడు, " మేనకా! మునులలో ఉత్తముడు అయిన నారదమహర్షి చెప్పిన మాటలు వృధా అవ్వవు. మన పార్వతికి శివమహాదేవుని తోనే వివాహం అవుతుంది. ఈ వివాహం జరగడం వల్లనే మనము, అన్ని లోకాలు కూడా సంతీషంగా వుండ గలుగు తాయి. కనుక, నువ్వు అమ్మాయి దగ్గరకు వెళ్ళి శివ మహాదేవుని కోసం తపస్సు చేయడానికి అమ్మాయి కి అనుమతి ఇచ్చి పంపు" అని చెపుతాడు.*
*హిమవంతుని మాటలను విని మేనక పార్వతి దగ్గరకు వెళ్లి తపస్సు గురించి చెప్పాలి అనుకుని కూడా చిన్న పిల్ల అని సంకోచిస్తూ ఉండిపోతుంది. అప్పుడు తన తల్లి పరిస్థితి గమనించిన పార్వతి, "అమ్మా! నిన్నటి రోజు రాత్రి నిద్రలో నాకు ఒక కల వచ్చింది. అది నీకు చెపుతాను. ఆ కలలో, ఎంతో దయగలవాడు, సుదీర్ఘ తపస్సు చేసిన వాడు అయిన ఒక బ్రాహ్మణుడు నాకు కనిపించి, శివుని ప్రసన్నం చేసుకునేందుకు ఉత్తమమైన తపస్సు చేసే పద్దతి నాకు చెప్పారు." అంది. ఇది విన్న మేనక, హిమవంతుని పిలిచి పార్వతి కల గురించి చెప్పింది.*
*అప్పుడు, హిమవంతుడు పార్వతికి కల వచ్చిన సమయానికే తనకు వచ్చిన కల గురించి ఇలా చెప్పాడు. " కలలో నాకు ఒక తపస్వి కనిపించారు. ఆతను, నారదమహర్షి శివుని గురించి చెప్పిన లక్షణాలతో ఉన్నాడు. ఎంతో ప్రసన్నంగా కనిపిస్తూ మన నగరానికి దగ్గరలోనే తపస్సు చేసుకోవడానికి వచ్చారు. నేను, పార్వతి తో కలసి ఆ తేజస్వి అయిన తపస్వి వద్దకు వెళ్ళి, అన్ని ఉపచారాలు చేసి, పార్వతి చేసే ఉపచారాలను నిత్యం అందుకోమని అడిగాను. కానీ, ఆ మహర్షి అందుకు ఒప్పుకోలేదు. అప్పుడు అక్కడ ఎన్నో వాద వివాదాలు, తర్క వితర్కాలు జరిగాయి. చివరికి, ఆ వేద పండితుల ఉపదేశం మేరకు, పార్వతి వసేవలు స్వీకరించి, పార్వతి ని గ్రహించడానికి అంగీకరించారు ఆ మహా తపస్వి. అప్పుడు పార్వతి వారికి సేవ చేస్తూ, వారే తన పతి అవ్వాలి అని తపస్సు చేసుకుంటూ అక్కడే వుండి పోయింది. ఇది నాకు కనిపించిన కల. కనుక మనం ప్రస్తుతానికి, పార్వతి కి, నాకు వచ్చిన కలల ఫలితం కనిపించే వరకు వేచి ఉండడమే మంచిది అని నాకు అనిపిస్తోంది " అని హిమవంతుడు అన్నాడు.
*అలా మేనకా, హిమవంతులు స్వప్న ఫలితాన్ని పరీక్షించడానికి నిశ్చయించుకుని, ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి