ఎర్రటి ఎండలో నయినా సరే పదిమంది కుర్రాళ్ళు కలిస్తే చెడుగుడు తప్పకుండా ఆడుతారు. ఇసకలో పడి దొర్లడం వాళ్లకు చాలా ఆనందాన్ని కలిగించే చెడుగుడు ఆట ఆ బృందం మొత్తానికి సంబంధించినది. అవతల వాడు కూతకు వచ్చినప్పుడు అతన్ని పట్టుకుంటే వీళ్ళకు ఒక పాయింట్ వస్తుంది. అలా ఎవరు ఎన్ని ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే వారు గెలిచినట్టు దీని లాగానే కబాడి ఉంటుంది ఇది అందరికి సంబంధించినది కాదు వ్యక్తిగతం. అవతల వాడు కబాడీకి వచ్చి ఒకడిని అంటుకుంటే వాడే చనిపోయి బయటకు వెళతాడు ఇద్దర్నీ ముగ్గురిని అంటుకునే అవకాశం కూడా ఉంటుంది అతను ఎంతమందిని అంటుకుంటే అంతమంది బయటికి వెళ్ళాలి మిగిలిన వారిని సునాయాసంగా జయించవచ్చు దీనికి శారీరక బలం కావాలి, మానసిక బలం కావాలి. వాడి నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించి తన శారీరక బలంతో ప్రక్కకు వెళ్లాలి. చెడుగుడు సామూహిక మైతే కబాడి వ్యక్తిగతం. ఉన్నత పాఠశాల స్థాయిలో విద్యార్థులు ఆడే మరొక ఆట కోకో గీత దాటకుండా పరిగెత్తాలి శరీరం ఎటు తిరిగితే అటు పరిగెట్టాలి తప్ప రెండో వైపు వెళ్ళడానికి వీలు లేదు వీడి నుంచి తప్పించుకోవడానికి అవతలి వాడు అనేక పద్ధతులను అవలంబించి మాయోపాయంతో గెలవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ ఆటకు వయోభేదం లేదు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఆడతారు చూసేవారికి ఎంతో ఆత్రుతగా ఉంటుంది ఈ ఆట. మగపిల్లలు ఎక్కువగా బ్యాట్మెంటన్ ఆడతాడు. ఆడేటప్పుడు ఆ బంతి ఎక్కడ పడాలో ముందే ఊహించుకుని ఎక్కడ మనుషులు తక్కువగా ఉన్నారో ఆ స్థలానికి చేరుకునేలా అక్కడ వేస్తాడు బంతి. అవతల వాడికి కొంచెం కష్టం అవుతుంది. ఆడపిల్లలైతే అటు ఇద్దరు ఇటు ఇద్దరు కానీ ఇటు నలుగురు కానీ ఉండి షేటిల్ కాక్ ఆడతారు మగవారిని మించిన ఆట ఇది.
పిక్క బలం ఉన్నవాళ్లు ఫుట్‌బాల్ ఆడతారు. దీనిలో రెండు రకాలు ఒకటి శక్తిసామర్థ్యాలు చూపడం ఎంత త్వరగా గోల్ చేయగలిగితే అంత విజయాన్ని పొందవచ్చు. రెండవది బుర్రకు పని చెప్పడం తన జట్టు నుండి అవతలి జట్టు లేని ప్రాంతాలకు బంతిని పంపడం. వీలైనంత త్వరగా గోల్ చేయడం శరీర శ్రమతో కూడిన పని దానితో పాటు మెదడుకు పని కల్పిపిస్తుంది కూడా తర్వాత వాలీబాల్ కూడా రెండు రకాల ప్రయోజనాలతో కూడుకున్నది అవతల రెండో పార్టీ వాళ్ళు నిలబడ్డ స్థలాలను చూసి ఎక్కడ ఖాళీ స్థలం ఎక్కువ ఉంటే అక్కడకు బంతి వెళ్ళేట్లు కొట్టాలి అవతల వాడు కూడా అలాగే కొట్టినప్పుడు చాలా జాగ్రత్త వహించి ఆ బంతిని మళ్ళీ వారి కోర్ట్ లోకి పంపించాలి ఎంత హుషారుగా ఆడితే అంత ఆనందంతో పాటు విజయం కూడా దక్కించుకుంటారు.
గొప్ప స్థపతి మా శివ నాగిరెడ్డి గారు (47);-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి