విద్యాభ్యాసం;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 బాలుడు సక్రమమైన మార్గంలో నడవడం కోసం మంచి బుద్ధులు అలవర్చుకోవడం  కోసం పెద్దలపట్ల గౌరవభావం, భక్తి భావం పెరగడం కోసం  తల్లిదండ్రుల పట్ల భయభక్తులతో మెలగడం  తోటి విద్యార్థులతో కలిసి  ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా జీవించడం ఎలాగో  తెలుసుకోవడం లాంటివన్నీ గురుముఖతః నేర్చుకుంటేనే  విద్యార్థి తన జీవితాన్ని సుఖమయంగా గడపడానికి అవకాశం ఉంటుంది  అన్న అభిప్రాయంతో  ఆ రోజుల్లో ఐదు సంవత్సరముల ఐదు నెలల ఐదు రోజులు నిండిన తరువాత మంచి గురువును ఎన్నుకొని వారి వద్దకు తన కుమారుని లేదా కుమార్తెను తీసుకుని వెళ్లి వారి చేతులలో పెట్టి వారికి పాదాభివందనం పిల్లలతో చేయించి తాను చేసి  ఈ రోజు నుంచి బాధ్యత మీదే  అని వారికి అప్పగించి రావడం  సనాతన ధర్మం. గురువుగారి దగ్గర భయభక్తులతో వారు చెప్పిన ప్రతి అక్షరాన్ని ధారణ చేసి  దానిని సాధన చేస్తూ జీవితంలో అక్షరము యొక్క విలువ తెలుసుకుంటాడు. క్షరం కాని ఆ అక్షరం  తెలుసుకోవడానికి  ప్రతి అక్షరం లోను ఎన్ని విభాగాలు ఉన్నాయో  ఏ అక్షరం మరొక అక్షరంతో కలిపితే ఎలాంటి అర్థం వస్తుందో  ఎదుటివారికి ఇబ్బంది కలగకుండా మన ప్రవర్తన ఎలా ఉండాలో అది గురుముఖతః కాకుండా  గురువు ఏది ఆచరిస్తూ ఉంటాడో దానిని చూసి నేర్చుకోవడం విద్యార్థి లక్షణం  ఉదయం లేవడం దగ్గర నుంచి సాయంత్రం పడుకునే అంతవరకు ప్రతి కార్యక్రమం వారు ఎలా చేస్తే  విద్యార్థులు అలా చేయడానికి ప్రయత్నం చేసి కృత కృత్తులు కావాలి  అప్పుడు వారు ఉత్తమ పౌరులుగా  తిరిగి తన కుటుంబ సభ్యులను చేరుకుంటాడు. ఈ నేర్చుకునే విద్యార్థులలో ముఖ్యంగా మూడు రకాల వారు ఉంటారు.  మౌనంగానే గురువుగారు దేనిని చెబుతున్నారో దానిని అర్థం చేసుకున్న వారు మొదటి రకం అయితే కొంచెం మందకొడిగా ఉన్న  విద్యార్థి పాటికి పది సార్లు చెప్పితే కానీ అర్ధం చేసుకోలేడు అలాంటి వాడి పైన శ్రద్ధ పెట్టి గురువుగారు  ఒక పాఠాన్ని 30 రోజులైనా చెప్పి అతనికి వచ్చేలా  శిక్షణ ఇస్తాడు  విద్యార్థి కూడా దానికి తగినట్టుగానే ప్రవర్తిస్తూ  గురువుగారిని అనుసరిస్తూ ఉంటాడు. ఇంకా చివరివాడు మూర్ఖుడు గురువు 30 రోజులు కాదు 300 రోజులు చెప్పినా అతని బుర్రలో ఒక్క అక్షరం కూడా నిలవదు. అలా చేయడానికి గురువుగారు ఎంతో ప్రయత్నం చేస్తారు. అయినా వారు విజయాన్ని సాధించిన దాఖలాలు ఎక్కడా కనిపించవు. ఈ మూటిని వేమన మహాసేయుడు ఎంత అందంగా ఎంత గొప్పగా చెప్పాడో ఒకసారి మీరు ఆ పద్యాన్ని చదివితే తెలుస్తుంది.

"ఎడ్డె దెల్ప వచ్చు నేడాది లోగానైన
మౌని దెల్ప వచ్చు మాసముననె 
మొప్పె దెల్పరాదు ముప్పడెండ్లకునైన..."


కామెంట్‌లు