సుప్రభాత కవిత ; -బృంద
గగన సీమల సాగే
మేఘమాలల వలపురాగాలు
మలయమారుతాలు లయగా
గానం చేస్తూ... మోసుకొస్తుంటే

మంచుకొండల అంచున
హరివిల్లు విరిసినట్టు
అరుణకాంతులు  చిమ్మగా
వెలుగుల తేరుపై వచ్చు

వేకువపువ్వుకై ఎదురుచూసి
పరవశమైన మానసపు
మధురమైన నిరీక్షణ
ముగిసి మురిసే క్షణాలకై

అచ్చెరువున అచ్చెరువుగ
తన బింబమె చూసుకుని
ఆనందం  అర్ణవమవగా
అంబరాన  సంబరమే చేస్తూ

ఆప్తమిత్రుని ఆహ్వానింవ
ఆకసాన  అంతా తానై
తెలిమంచు తెరతీసి
వేచి ఉన్న జీమూతబృందాల

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు