పంచదార చిలక ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 బాలల్లారా రారండి
పంచదార చిలకను చూడండి
ముక్కు తిన్నా తియ్యదనమే
రెక్క తిన్నా తియ్యదనమే
వేలు తిన్నా తియ్యదనమే
కాలు తిన్నా తియ్యదనమే
ఎక్కడతిన్నా తియ్యదనమే
ఎప్పుడైనా ఎక్కడైనా
మనము కూడా అందరితో
మంచిమాటలే మాటాడాలి
మంచి నడవడితొ ఉండాలి
అప్పుడు మనను అంటారు
పంచదార చిలకలాంటి పిల్లలని
మెచ్చుకుంటారు అందరు !!

కామెంట్‌లు