శిశిర కాంత;-ఎం. వి. ఉమాదేవి
మెరుపులు 

పడిపోయిన ఉష్ణోగ్రతలు 
అనారోగ్యం పంచుతాయి 
మెలుకువగా జాగ్రత్తలు 
కుటుంబం రక్షణ నిస్తాయి !!

శిశిరకాంతకి లొంగినాడు 
భానుడివేడి తగ్గుతుంది 
శీతగాలులకి వణికాడు 
జనానికీ  చలిగాఉంది!!

ఇల్లనేగూడు ఒకటుండాలి  
పేదలకి తలదాచుకోను 
ఆహారమిస్తూ ఆదుకోవాలి 
ప్రభుత్వం బాధ్యతగాను !!

గడ్డకట్టిన జలంతీరు 
నాయకుల కఠినత్వం 
దుప్పట్లులేని కన్నీరు 
అనాథల దీనత్వం !!

అదుగో మానవతాలిపి 
అర్థరాత్రి మేల్కొంటూ 
రోడ్లుపక్కన నిద్రలేపి  
రగ్గులు అందుకోమంటూ !!

ఋతువులకీ చులకనగాను  
మూగజీవుల గోసలు 
శాలచుట్టూ టార్పాలిను 
మనసున్నవారి చేతలు !!

.

కామెంట్‌లు