తిశ్రగతి;-చంద్రకళ యలమర్తి
రాజ్యమేలు రారాజును 
మురిపించే  ప్రేయసివే 
యుద్ధములో విజయాలను 
కురిపించే ప్రేయసివే 

నాప్రాణము నీవేనని 
అనిపించే  ప్రేయసివే 
పలుకులలో తేనియలే 
 వినిపించే   ప్రేయసివే 

మామదిలో మన్మధుడే
సందడినే  చేసెనేడు
నాకనులకు మోహినిగా 
కనిపించే ప్రేయసివే

మధువులనూ మగువలనూ 
విడిచివస్తి నీచెంతకు 
గానముతో చింతలన్ని 
మరిపించే ప్రేయసివే 

చంద్రునికీ తారకలా 
ననుగెలిచిన నెరజాణవు
చిరునగవుతొ ననునిత్యం 
గెలిపించే ప్రేయసివే 


కామెంట్‌లు