బాలిక (బాలగేయం);--గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు.
చదువుకున్న బాలిక
దీపమే ఇంటిలో
భగవంతుని కానుక
తారమ్మ మింటిలో

విజయోత్సవ గీతిక
ఆర్జించిన జ్ఞానము
గుబాళించే హారిక
బాలిక ఇల ముత్యము

పరమౌషధ మూలిక
ఆడపిల్ల మహిలో
చిరునవ్వుల వాటిక
గౌరవించు మదిలో

సదనంలో వేడుక
సిరిమల్లె రీతిలో
ఆప్యాతల వేదిక
ఆడపిల్ల భువిలో


కామెంట్‌లు