చిత్రస్పందన /;-టి. వి. యెల్. గాయత్రి.పూణే.మహారాష్ట్ర.
వేళమించిపోయె
(పద్యములు )

1.
గుండెల నిండ ప్రేమ మెయి కూరిమి మీరగ నిన్ను దల్చుచున్
వండితి పాయసాన్నములు పాలును శర్కర కల్పి తీయగన్
మెండుగ బోసి పళ్లెమున మేలగు భక్ష్య రసాన్నపు శాకపాకముల్
పండగ నేడు రార!పరి వారము తోడ శుభంబుగన్ హరీ!

2.
వేళయె మించి పోయె కను విందుగ రావయ!నన్ను గాంచగన్
మేలగు వస్త్రముల్ మరియు
మేలిమి బంగరు భూషణంబులన్
నీలపు రత్న రాసులను నీకొరకై పలు వర్ణ పుష్పముల్
దాలిమి తోడ తెచ్చితిని 
దాసిని బ్రోవగ రమ్ము శ్రీహరీ!

3.
మానవు నీదు చేష్టలను
మాన్యుడ వంచును వేచి యుంటి నా 
బ్రాణము పోవు చున్నదయ!
వంచన చేయుట నీకు పాడియా!
కానవు నాదు కష్టమును కాంతుడ వీవని నమ్మి దల్తు నో 
గాన విలోల! రమ్మిటకు!
గ్రక్కున విందుకు వేగమే హరీ!/
---------------------------
కామెంట్‌లు